Madhuri Dixit : అలనాటి అందాల తార మాధురి దీక్షిత్ ది వన్నె తగ్గని అందం. ఈమెకు వయస్సు మీద పడుతున్నా ఇంకా అప్పట్లో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంటుంది. అంతటి అందం ఈమె సొంతం. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మాధురి దీక్షిత్ డ్యాన్స్ కూడా బాగా చేస్తుంటుంది. అప్పట్లో ఆమె డ్యాన్స్ కోసమే ఎంతో మంది సినిమాలు చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. మాధురి దీక్షిత్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సన పని కూడా లేదు.
ఇక మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ సిరీస్.. ది ఫేమ్ గేమ్. ఈ సిరీస్ ఫిబ్రవరి 25వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే ఈ సిరీస్‌కు చెందిన మ్యూజిక్ వీడియోను నెట్‌ఫ్లిక్స్ ఆదివారం విడుదల చేసింది. ఇందులో మాధురి దీక్షిత్ మరోమారు తన డ్యాన్స్ స్టెప్స్‌తో ఆకట్టుకుంది. దుపట్టా మేరా.. అంటూ సాగే ఈ పాటలో మాధురి తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అలరించింది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
కాగా ది ఫేమ్ గేమ్ సిరీస్‌ను థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించారు. ఓ ప్రముఖ నటి ఉన్నట్లుండి కనిపించకుండా పోతుంది. ఈక్రమంలో ఆ కేసును దర్యాప్తు చేస్తున్న సందర్భంలో పోలీసు అధికారులకు ఆమె జీవితం గురించి పలు చేదు నిజాలు తెలుస్తాయి. అయితే చివరకు ఏమైంది ? ఆ నటి ఆచూకీ మళ్లీ లభించిందా ? అన్న వివరాలు తెలియాలంటే.. ఈ సిరీస్‌ను చూడాల్సిందే. ఇక ఈ సిరీస్ లో సంజయ్ కపూర్, మానవ్ కౌల్, లక్ష్‌వీర్ శరన్, సుహాసిని ములే, ముస్కాన్ జఫెరిలు ఇతర పాత్రల్లో నటించారు.