Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత ఎంతో బిజీగా మారిపోయింది. చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు ఐటమ్ గర్ల్‌గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక గ్లామర్ షోకు అయితే కొదువ లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా అందాల ఆరబోతకు తెరలేపింది. ఈ మధ్య కాలంలో తరచూ ఈమె వార్తల్లో నిలుస్తోంది. అయితే సమంతకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే..
సమంత గతంలో ఎంతో కూల్‌గా ఉండేదట. షూటింగ్‌లకు టైముకు రావడంతోపాటు సెట్‌లో అందరితోనూ ఎంతో కలుపుగోలుగా మాట్లాడేదట. నిర్మాతలను, దర్శకులను ఇబ్బందులు పెట్టకపోయేదట. కానీ ఇప్పుడు ఆమె మారిందని టాక్ వినిపిస్తోంది. గతానికి ఆమె పూర్తిగా భిన్నంగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నదట. ఉన్న ఫలంగా షూటింగ్ లను క్యాన్సిల్ చేస్తున్నదట. తనకు వచ్చిన స్టార్ డమ్ కారణంగా కాస్తంత గర్వంగా కూడా ఫీలవుతున్నదట. ఈ క్రమంలోనే సమంత వ్యవహారం ఇప్పుడు చిత్ర మేకర్స్‌కు నచ్చడం లేదని తెలుస్తోంది.
అయితే సమంత ఇలా ప్రవర్తించేందుకు కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈమెకు బాలీవుడ్‌లో వస్తున్న ఆఫర్లతోపాటు.. ముంబైలో పలు ఈవెంట్లకు హాజరు కావాలని ఆహ్వానాలు కూడా అందుతున్నాయట. కనుకనే బాలీవుడ్ వైపు ఎక్కువగా ఫోకస్ పెట్టిందని.. అందులో భాగంగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ విధంగా ప్రవర్తిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే గనక నిజమైతే ఈమె కెరీర్ ఇక్కడ అర్థాంతరంగా ముగుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సమంత తాను చేస్తున్న తప్పులను తెలుసుకుంటుందో.. లేదో.. చూడాలి.