మనకు సహజ సిద్ధంగా అందుబాటులో ఉన్న అనేక రకాల పదార్థాల్లో కొబ్బరి, బెల్లం కూడా ఉన్నాయి. ఇవి చాలా శక్తివంతమైన పోషకాలను ఇచ్చే ఆహారాలు. వీటిని నేరుగా కూడా తినవచ్చు. రోజూ ఒక చిన్న కొబ్బరి ముక్కను, ఒక బెల్లం ముక్కను తింటే చాలు.. మనం ఎన్నో పోషకాలను పొందవచ్చు. దీంతో పలు అనారోగ్య సమస్యలు కూడా నయం అవుతాయి. ఇక కొబ్బరిని, బెల్లాన్ని కలిపి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి, బెల్లం.. రెండింటిలోనూ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీర నిర్మాణానికి, కండరాల పనితీరుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎదిగే పిల్లలకు ఇవి అవసరం. దీంతో వారిలో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. బద్దకం అనేది ఉండదు. ఏ పనిలో అయినా సరే చురుగ్గా పాల్గొంటారు.
ఈ రెండింటిలోనూ మెగ్నిషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ల నుంచి బయట పడేస్తుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇక ఈ రెండింటిలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది.
ఈ రెండింటిలోనూ కాల్షియం కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను దృఢంగా మారుస్తుంది. కొబ్బరి, బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రెండింటినీ తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, మలబద్దకం, అసిడిటీ అన్ని తగ్గిపోతాయి. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది.
కొబ్బరి, బెల్లం రెండింటినీ కలిపి గర్భిణీలు తినడం వల్ల పిల్లల్లో ఎదుగుదల రాకుండా ఉంటుంది. పిల్లల్లో పుట్టుకతో లోపాలు రావు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి వ్యాధిని అయినా సరే తట్టుకుంటారు. అలాగే తలనొప్పితో బాధపడుతున్నవారికి ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రెండింటినీ కలిపి తింటే ఎలాంటి తలనొప్పి అయినా సరే వెంటనే తగ్గిపోతుంది. ఇలా కొబ్బరి, బెల్లం మిశ్రమం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రెండింటినీ కలిపి రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.