Treasure Box : మీరు సాధారణంగా రోజూ దేనిపై నిద్రిస్తారు..? నేలపైనా..? మంచం పైనా..? నేలపైనైతే ఇప్పుడు మేం చెప్పబోయేది వర్తించదు. కానీ మంచంపై పడుకునే వారైతే కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మనలో చాలా మందికి మంచం లేదా ప్లై వుడ్‌తో తయారు చేసిన బెడ్ ఏది ఉన్నా ఇంట్లో స్థలం లేదనో, మరేదైనా కారణాల వల్లో ఆ బెడ్స్ కింద ఏది పడితే ఆ వస్తువును పెడుతుంటారు. కానీ మీకు తెలుసా..? అలా బెడ్ల కింద దేన్ని పడితే దాన్ని పెట్టకూడదట. లేదంటే దాంతో మనకు అన్నీ దుష్ఫలితాలే కలుగుతాయట. అవేమిటంటే..
మీకు ఫెంగ్ షుయ్ వాస్తు తెలుసు కదా. చైనీయులు నమ్మే శాస్త్రాల్లో ఇది కూడా ఒకటి. అయితే మంచం కింద పెట్టే వస్తువుల గురించి ఫెంగ్ షుయ్ శాస్త్రం ఏం చెబుతుందంటే.. మనం మంచంపై పడుకున్నప్పుడు మన చుట్టూ మంచం కిందుగా పాజిటివ్ శక్తి తిరుగుతూ ఉంటుందట. మన మెదడులోని సబ్‌కాన్షియస్ మైండ్ ఆ శక్తిని గ్రహిస్తుందట. అయితే మంచం కింద ఏం లేకుండా ఉన్నప్పుడు ఈ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉండి ఎక్కువ శక్తిని గ్రహిస్తుందట. అదే మంచం కింద ఏదైనా వస్తువు ఉంటే దాని వల్ల సబ్ కాన్షియస్ మైండ్ శక్తిని గ్రహించేందుకు ఆటంకం ఏర్పడుతుందట.
ఈ క్రమంలో నెగెటివ్ శక్తి ప్రసారమై అది మనకు కీడును కలిగిస్తుందట. అయితే మంచం కింద ఖాళీగా ఉంటే సబ్‌కాన్షియస్ మైండ్ బాగా పనిచేస్తుంది కానీ, ఒక ప్రత్యేకమైన వస్తువును పెడితే అది ఇంకా ఎక్కువ శక్తిని గ్రహిస్తుందట. దీనికి తోడు పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుందట. ఇంతకీ మంచం కింద పెట్టాల్సిన ఆ ప్రత్యేక వస్తువు ఏమిటంటే..
ట్రెజర్ బాక్స్.. అవును, మీరు విన్నది నిజమే. మంచం కింద ట్రెజర్ బాక్స్‌ను పెట్టి నిద్రిస్తే దాంతో మన సబ్‌కాన్షియస్ మైండ్‌కు మిక్కిలి శక్తి వస్తుందట. అయితే ట్రెజర్ బాక్స్ అంటే అదేదో నిధులు, మణులు, మాన్యాలు ఉన్న బాక్స్ అనుకునేరు. అది మాత్రం కాదు. కానీ దాదాపుగా అలాంటిదే. అయితే దాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే.. ఇమిటేషన్ గోల్డ్, వెండి, చలువ లేదా గ్రానైట్ రాయి, సెరామిక్ వంటి పదార్థాల్లో దేన్ని ఉపయోగించైనా తయారు చేసిన దట్టమైన మూత గల ఒక చిన్న పెట్టెను తెచ్చుకోవాలి. అందులో బంగారు ఆభరణాలు, కాయిన్స్, క్రిస్టల్స్ వంటి వస్తువులను వేసి బాక్స్ లాక్ చేయాలి.
అనంతరం ఆ బాక్స్‌ను మీరు నిద్రించే మంచం కింద పెట్టాలి. అయితే ఆ పెట్టె మీ నాభి కిందుగా వచ్చేట్టు చూసుకోవాలి. దీని వల్ల మీలో పాజిటివ్ శక్తి పెరుగుతుంది. మైండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఉత్తేజం కలుగుతుంది. అంతేకాదు అదృష్టం కూడా వస్తుందట. అయితే ఆ బాక్స్‌లో పైన చెప్పిన వస్తువులు కాకుండా పర్‌ఫ్యూమ్‌లు, సెంట్లు, ఎరుపు రంగు కొవ్వొత్తులు, క్రీమ్, సువాసన ద్రవ్యాలు, ఆయిల్స్ వంటి వాటిని ఉంచితే అలాంటి వారికి జీవితంలో అనుకున్నవి నెరవేరుతాయట. ప్రేమించే వ్యక్తులు దగ్గరవుతారట. తెలుసుకున్నారుగా, ఫెంగ్ షుయ్ ట్రెజర్ బాక్స్ గురించి. ఇంకెందుకాలస్యం, వెంటనే మీరూ ఓ బాక్స్‌ను మంచం కింద పెట్టేయండి. ఒక వేళ పెట్టకున్నా సమస్యేమీ లేదు. కానీ ఆ స్థలాన్ని మాత్రం ఖాళీగా ఉంచడం మరిచిపోకండి. మంచం కింద పెడితే పైన చెప్పినట్లు ట్రెజర్ బాక్స్ పెట్టండి.. లేదా ఖాళీగా ఉంచండి.. అంతేకానీ దేన్ని పడితే దాన్ని పెట్టకండి.