Phool Makhana Drink : వారంలో మూడు రోజులు కనుక ఇది తాగితే చాలు.. నీరసం, నిస్సత్తువ, అలసట, కీళ్ల నొప్పులు, క్యాల్షియం లోపం వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఏ చిన్న పని చేసినా అలసిపోతూ ఉన్నా ఏ పని చేసినా ఉత్సాహం లేకుండా నీరసించి పోతున్నా, తరచూ అనారోగ్యా ల బారిన పడుతున్నా, నడిచేటప్పుడు మోకాళ్ల నుండి శబ్దం వస్తున్నా, మానసిక ఒత్తిడి కారణంగా రాత్రి పూట నిద్రటపట్టకపోయినా, జుట్టు విపరీతంగా రాలిపోతున్నా, చిన్న వయసులోనే ముఖం పైన ముడతలు వస్తున్నా ఇలా ఎటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా ఇటువంటి సమస్యలన్నింటిని మనం సహజసిద్దమైన ఇంటి చిట్కాను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఒక టీ స్పూన్ గసగసాలను వేసి అర నిమిషం పాటు వేయించాలి.
గసగసాలను చాలా మంది మసాలా దినుసులుగానే భావిస్తారు. కానీ వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఫైటో కెమికల్స్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. నిద్రలేమి సమస్యను తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఈ గసగసాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీటిలో పుష్కలంగా ఉండే క్యాల్షియం కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా మనకు దోహదపడుతుంది. గసగసాలు మన శరీరానికి ఎటువంటి దుష్ప్రభావాన్ని కలిగించకుండా శరీరంలోని నొప్పులన్నింటిని తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారికి కూడా గసగసాలు చక్కటి ఆహారమనే చెప్పవచ్చు. దగ్గును తగ్గించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ గసగసాలు మనకు తోడ్పడుతాయి.
ఇలా గసగసాలను వేయించిన తరువాత ఇందులో ఒక గ్లాస్ ఆవు పాలను పోయాలి. ఆవు పాలు అందుబాటులో లేని వారు ఇందులో గేదె పాలను, బాదం పాలను కూడా వేసుకోవచ్చు. ఇలా పాలను పోసిన తరువాత ఇందులో ఒక కప్పు ఫూల్ మఖనాను వేసుకోవాలి. ఫూల్ మఖానాలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. గుండె జబ్బులను నివారించడంలో, క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను నశింపజేయడంలో ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే వీటిలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సోడియం మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కఫ, పిత దోషాలను తొలగించడంలో కూడా ఈ ఫూల్ మఖనీ మనకు ఉపయోగపడుతుంది.
ఎముకలను ధృడంగా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, నిద్రలేమిని, అలసటను తొలగించడంలో, వృద్ధాప్య ఛాయలను తొలగించడంలో, లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కూడా ఈ ఫూల్ మఖనీ మనకు దోహదపడుతుంది. ఇలా ఫూల్ మఖనీ వేసిన తరువాత ఈ పాలను మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న పాలను ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇందులో తీపి కొరకు బెల్లాన్ని లేదా పటిక బెల్లాన్ని వేసి కలిపి తాగాలి. ఈ పాలను వడకట్టకుండా అలాగే తాగాలి. ఇలా తయారు చేసుకున్న పాలను వారానికి మూడు సార్లు తాగాలి. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఈ పాలను తాగవచ్చు. ఇలా తయారు చేసుకున్న పాలను తాగడం వల్ల నీరసం తగ్గి కొత్త శక్తి వస్తుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పాలను తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.