వేసవిలో సహజంగానే మామిడి పండ్లు ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల పచ్చి మామిడికాయలు కూడా ఈ సీజన్‌లో ఎక్కువగానే లభిస్తాయి. చాలా మంది మామిడిపండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే పచ్చి మామిడికాయలను తినడం వల్ల కూడా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చి మామిడిపండ్లలో విటమిన్లు ఎ,సి,ఇ లతోపాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే పోషణ లభిస్తుంది.
2. కారం, మసాలాలు అధికంగా ఉండే పదార్థాలను తిన్నప్పుడు సహజంగానే ఒక్కోసారి కొందరికి జీర్ణాశయంలో మంటగా అనిపిస్తుంది. అలాంటి వారు పచ్చిమామిడి కాయలను నల్ల ఉప్పుతో తినాలి. దీంతో మంట తగ్గుతుంది. అలాగే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య ఉండదు.
2. పచ్చి మామిడి కాయలను తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. వేసవిలో వీటిని తింటే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరంలో నీటి సరఫరా సక్రమంగా జరుగుతుంది.
3. పచ్చిమామిడికాయలను తినడం వల్ల వేసవిలో సీజనల్‌గా వచ్చే అనారోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
4. పచ్చిమామిడికాయలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శరీరానికి ఐరన్ లభిస్తుంది. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది.
5. వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలను తగ్గించేందుకు పచ్చి మామిడికాయలు ఎంతగానో పనిచేస్తాయి. వీటిల్లో ఉండే పెక్టిన్ విరేచనాలు, హెమరాయిడ్స్, మలబద్దకం, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
పచ్చిమామిడి కాయలతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ వీటిని అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక వీటిని మోతాదులో మాత్రమే తినాలి. రోజుకు 100 నుంచి 150 గ్రాముల మేర ఈ మామిడి పండ్లను తినవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365