Korrala Pakodilu : చిరు ధాన్యాల్లో ఒకటైన కొర్రల గురించి అందరికీ తెలిసిందే. వీటిని చాలా మంది ప్రస్తుతం ఆహారంగా తీసుకుంటున్నారు. కొర్రలను తినడం వల్ల షుగర్ అదుపులోకి వస్తుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. అధిక బరువు కూడా తగ్గుతారు. అయితే కొర్రలతో సాధారణంగా చాలా మంది అన్నం వండుకుని తింటారు. కానీ కొర్రలతో ఎంతో రుచికరమైన పకోడీలను కూడా చేసుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయి. అందరూ ఇష్టపడతారు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొర్రల పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
కొర్ర పిండి – 100 గ్రాములు, పాలకూర – 165 గ్రాములు, శనగపిండి – 20 గ్రాములు, పచ్చి మిర్చి – 2 గ్రాములు, జీలకర్ర – 2 గ్రాములు, నూనె – 30 మి.లీ., కారం – 3 గ్రాములు, ఉల్లిపాయలు – 40 గ్రాములు, ఉప్పు – తగినంత.
కొర్రల పకోడీలను తయారు చేసే విధానం..
కొర్ర పిండి, శనగ పిండి జల్లించుకోవాలి. ఒక గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, జీలకర్ర, కారం, పాలకూర, ఉప్పు, తగినంత నీరు పోసి పిండిని కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత పిండిని చేత్తో తీసుకుని పకోడీలా చేసి నూనెలో వేసి ఎర్రగా వేయించి తీయాలి. ఇలా పిండి మొత్తాన్ని పకోడీల్లా చేసుకుని వేయించాలి. దీంతో ఎంతో రుచికరమైన కొర్రల పకోడీలు తయారవుతాయి. వీటిని వేడిగా ఉన్నప్పుడు తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. ఇలా చేసిన కొర్రల పకోడీల్లో పోషకాలు అనేకం ఉంటాయి. 100 గ్రాముల పకోడీలను తింటే మనకు 242 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 4.1 గ్రాములు, కొవ్వులు 24.4 గ్రాములు, కాల్షియం 45.7 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 108.2 మిల్లీగ్రాములు, ఐరన్ 1.5 మిల్లీగ్రాములు లభిస్తాయి. దీని వల్ల మనకు పోషణ లభిస్తుంది.