Sunflower Seeds : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది నీరసం, అలసట, శరీరం బలంగా , ధృడంగా లేకపోవడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమ్యలు తలెత్తడానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లేనని చెప్పవచ్చు. శరీరానికి తగినన్ని పోషకాలు, శక్తిని అందించే ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఇటువంటి అనారోగ్య సమస్యలన్నీ తలెత్తుతున్నాయి. శక్తిని అందించడంతో పాటు శరీరాని బలంగా, ధృడంగా మార్చే ఆహారలను తీసుకోవడం వల్ల మనం ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. గింజ ధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు, మాంసకృత్తులు, విటమిన్స్, మినరల్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
అలాంటి అతి బలాన్ని ఇచ్చే గింజ ధాన్యాల్లో ప్రొద్దు తిరుగుడు పప్పు ఒకటి. ఇది మనకు తక్కువ ధరలో కూడా లభిస్తుంది. ప్రొద్దు తిరుగుడు గింజల నుండి తీసిన నూనెను వాడడం వల్ల మన శరీరానికి హాని కలుగుతుంది. కానీ ఈ పప్పును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. తక్కువ ఖర్చులో లభించే అతి గొప్ప ఆహారాల్లో ఈ పొద్దు తిరుగుడు పప్పు ఒకటి. చాలా మందికి ఈ పప్పు గురించి తెలియనే తెలియదు. శ్రమ ఎక్కువగా చేసే వారికి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు, శారీరక ధృడత్వం కొరకు వ్యాయామం చేసే వారికి తక్కువ ఖర్చులో చక్కటి ఆహారంగా దీనిని చెప్పుకోవచ్చు. 100 గ్రాముల పొద్దు తిరుగుడు పప్పులో 620 క్యాలరీల శక్తి ఉంటుంది.
జీడిపప్పు, చేపలు, మాంసం కంటే కూడా ఈ పప్పులో ఎక్కువ శక్తి ఉంటుంది. అలాగే ఈ పప్పులో 20 శాతం ప్రోటీన్లు, 17 గ్రాములు కార్బోహైడ్రేట్స్ , 52 గ్రాముల కొవ్వు, 670 మిల్లీ గ్రాముల పాస్ఫరస్ ఉంటుంది. అదేవిధంగా యవ్వనంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మనం అందంగా, యవ్వనంగా కనబడేలా చేసే విటమిన్ ఇ ని ఎక్కువగా కలిగి ఉండే ఆహారాల్లో పొద్దు తిరుగుడు పప్పు ఒకటి. 100 గ్రాములు పొద్దు తిరుగుడు పప్పులో 35 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ పొద్దు తిరుగుడు పప్పును ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పప్పును రోజూ గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టుకుని తీసుకోవాలి. ఈ పప్పులో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది కనుక దీనిని నేరుగా తినడం వల్ల వికారం, వాంతి అయ్యే అవకాశం ఉంది.
అలాగే వీటిని నేరుగా తీసుకోవడం వల్ల సరిగ్గా జీర్ణమవ్వక శరీరానికి పోషకాలు ఎక్కువగా అందవు. కనుక వీటిని నానబెట్టుకుని తినడం వల్లే మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. 2 సంవత్సరాల పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎవరైనా వీటిని తీసుకోవచ్చు. అలాగే పొద్దు తిరుగుడు పప్పులో కొలెస్ట్రాల్ ఉండదు. వీటిని తీసుకవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ విధంగా ప్రొద్దు తిరుగుడు పప్పును తీసుకోవడం వల్ల మన శరీరం బలంగా అవ్వడంతో పాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.