Soup : మనలో చాలా మంది సూప్ లను ఇష్టంగా తాగుతూ ఉంటారు. అలాగే మనకు వివిధ రకాల సూప్ లు కూడా లభ్యమవుతూ ఉంటాయి. గొంతు సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడూ, జలుబుతో ఇబ్బందిపడుతున్నప్పుడు ఇలా వేడి వేడి సూప్ లను తాగితే చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే కొందరికి భోజనం చేయడానికి ముందు సూప్ లను తాగే అలవాటు ఉంటుంది. ఇలా భోజనానికి ముందు సూప్ తాగడమనేది చాలా మంచి అలవాటు అని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి పావు గంట లేదా 20 నిమిషాల ముందు సూప్ తాగడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. సూప్ తాగడం వల్ల జీర్ణాశయంలో ఉండే జీర్ణ రసాలు, ఎంజైమ్ లు ఉత్తేజితమవుతాయి. ఇవి జీర్ణాశయ గోడలను, కండరాలను సిద్దం చేసి ఆకలి ఎక్కువగా అయ్యేలా చేస్తాయి. అలాగే సూప్ లలో మిరియాలు, కొత్తిమీర, పుదీనా వంటి వాటిని వేస్తూ ఉంటారు. ఇవి ఆకలి పెరిగేలా అలాగే తిన్న ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేయడంలో సహాయపడతాయి.
సూప్ లు తాగడం మన ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికి చాలా మంది బయట దొరికే సూప్ మిక్స్ లను వాడుతుంటారు. ఇవి ఇన్ స్టాంట్ సూప్ మిక్స్ లతో తయారు చేస్తూ ఉంటారు. వీటిలో ఫుడ్ కలర్స్ తో పాటు ఫ్రిజర్వేటివ్స్ ను కూడా కలుపుతూ ఉంటారు. అలాగే ఇవి చిక్కగా ఉండడానికి కార్న్ ఫ్లోర్ ను ఎక్కువగా కలుపుతూ ఉంటారు. అలాగే రుచి కొరకు ప్రక్టోజ్ సిరప్ లను కలుపుతూ ఉంటారు. అలాగే సాల్ట్, మోనో సోడియం గ్లుటమేజ్( ఎమ్ ఎస్ జి) ను కలుపుతూ ఉంటారు. ఎమ్ ఎస్ జి ఎక్కువ మోతాదులో కలపకూడదని సూచనలు కూడా ఉంటాయి. కానీ వీటిని పట్టించుకోరు. ఇన్ స్టాంట్ మిక్స్ లతో తయారు చేసుకున్న సూప్ లను తాగడం వల్ల శరీరానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. వీటిలో ఉండే ప్రక్టోజ్ సిరప్ ల వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆకలి నియంత్రణ లేకుండా పోతుంది. దీంతో ఎంత తిన్నామో తెలియకుండా తినేస్తూ ఉంటారు. ఇది అధిక బరువు బారిన పడేలా చేస్తుంది.
అలాగే ఇన్ స్టాంట్ మిక్స్ లతో తయారు చేసిన సూప్ ను తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని, ఇన్సులిన్ రెసిస్టెంట్ బారిన పడే అవకాశం ఉందని శాస్త్రీయంగా నిరూపించారు. ఈ సూప్ లను ఇన్ స్టాంట్ మిక్స్ లతో తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి మేలు ఎక్కువగా జరగక పోగా హాని ఎక్కువగా కలుగుతుంది. కనుక సూప్ లను సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం మంచిది. పాలక్ సూప్, టమాట సూప్, వెజిటేబుల్ సూప్, స్వీట్ కార్న్ సూప్, పుట్టగొడుగుల సూప్, పుదీనా సూప్, కొత్తిమీర సూప్ వంటివి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఇంట్లోనే తయారు చేసుకుని తాగడం వల్ల మనం చక్కటి ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఇలా సూప్ లను తయారు చేసుకుని తాగడం వల్ల ఆకలి పెరగడంతో పాటు తిన్న ఆహారం కూడా జీర్ణమవుతుంది.