Apples : రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని.. నిపుణులు చెబుతుంటారు. ఇది ఎప్పటి నుంచో చెబుతున్న మాటే. ఎందుకంటే.. యాపిల్ పండ్లలో మన శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు దాదాపుగా ఉంటాయి. అందువల్ల యాపిల్ పండు మనకు సంపూర్ణ పోషణను అందిస్తుందని చెప్పవచ్చు. కనుకనే రోగాలు రాకుండా ఉంటాయి. అందువల్లనే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని అంటుంటారు. అయితే యాపిల్ పండ్లను తినడం వల్ల పోషకాలు లభించడం మాత్రమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
యాపిల్ పండ్లను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటివి తగ్గుతాయి. యాపిల్ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఇక యాపిల్ పండ్లను తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు. ఫలితంగా షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
యాపిల్ పండ్లను తినడం వల్ల రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. యాపిల్ పండ్లను తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. జ్వరం వచ్చిన వారు యాపిల్ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. ఇలా యాపిల్ పండ్లను తినడం వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే యాపిల్ పండ్లను కొందరు రాత్రి పూట తింటుంటారు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ వీటిని రాత్రి పూట తినవద్దని వైద్యులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే త్వరగా జీర్ణం కావు. జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. అలాంటిది ఈ పండ్లను రాత్రి పూట తింటే జీర్ణ వ్యవస్థ పనులకు ఆటంకం ఏర్పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. కనుక రాత్రి పూట ఎట్టి పరిస్థితిలోనూ ఈ పండ్లను తినరాదు. ఉదయం లేదా మధ్యాహ్నం వీటిని తినవచ్చు. సాయంత్రం దాటిన తరువాత అయితే వీటిని అసలు తినరాదు. తింటే ఇబ్బందులు పడతామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.