Blackheads : మనలో చాలా మందికి ముఖంపై బ్లాక్ హెడ్స్ ఉంటాయి. బ్లాక్ హెడ్స్ సమస్యతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ఇవి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు, బుగ్గలు, వీపు, నుదురు వంటి భాగాల్లో వస్తూ ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్న వారిలో ఈ సమస్య మీర ఎక్కువగా ఉంటుంది. చర్మంపై ఉండే జిడ్డుతో మృతకణాలు, దుమ్ము, ధూళి వంటివి చేరి బ్లాక్ హెడ్స్ గా తయారవుతాయి. చాలా మంది ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి ప్రభావవంతమైన చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు.
ఈ చిట్కాను తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. బ్లాక్ హెడ్స్ ను తొలగించే ఆ చిట్కా ఏమిటి..దీనిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం వైట్ టూత్ పేస్ట్ ను, అర టీ స్పూన్ వంటసోడాను, అర టీ స్పూన్ కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా పావు టీ స్పూన్ టూత్ పేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో వంటసోడా, కొబ్బరి నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడానికి ముందుగా ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి. ఈ నీటిలో దూదిని ముంచి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో ముందుగా శుభ్రం చేసుకోవాలి.
తరువాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తీసుకుని బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి. చేతి వేళ్లతో రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా మర్దనా చేసుకోవాలి. దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆరిన తరువాత వేళ్లతో రుద్దుతూ నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. ఈ చిట్కాను వాడిన మొదటిసారే బ్లాక్ హెడ్స్ తొలిగిపోవడాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు. బ్లాక్ హెడ్స్ మరీ ఎక్కువగా ఉన్న వారు ఈ చిట్కాను వారానికి రెండు నుండి మూడు సార్లు పాటించాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగకుండా బ్లాక్ హెడ్స్ సమస్య నుండి బయటపడవచ్చు.