Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Egg 65 : ఎగ్ 65ని ఎంతో టేస్టీగా సింపుల్‌గా ఇలా చేయ‌వ‌చ్చు.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

D by D
March 16, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Egg 65 : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల‌లో ల‌భించే ఎగ్ వెరైటీస్ లో ఎగ్ 65 కూడా ఒక‌టి. ఎగ్ 65 చాలా రుచిగా ఉంటుంది. దీనిని పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ ఎగ్ 65 ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఇంట్లోనే సుల‌భంగా ఎగ్ 65 ను ఎలా త‌యారు చేసుకోవాలి…త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 5, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, వెల్లుల్లి త‌రుగు – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, ఎగ్ వైట్ – ఒక గుడ్డు నుండి తీసినంత‌, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, రెడ్ చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Egg 65 recipe in telugu very tasty easy to make
Egg 65

ఎగ్ 65 త‌యారీ విధానం..

ముందుగా కోడిగుడ్ల‌ల్లో ఉండే ప‌చ్చ సొన‌ను తీసేసి వాటిని చిన్న ముక్కలుగా క‌ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, గ‌రం మ‌సాలా, నిమ్మ‌ర‌సం, ఫుడ్ క‌ల‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో ఎగ్ వైట్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ప‌కోడీలా వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి.

త‌రువాత ఇందులో వెల్లుల్లి త‌రుగు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో వేయించిన కోడిగుడ్డు వేసి క‌ల‌పాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ 65 త‌యార‌వుతుంది. దీనిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం స‌మ‌యాల్లో కోడిగుడ్ల‌తో ఇలా ఎగ్ 65 ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇలా ఇంట్లోనే ఎగ్ 65 ను త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Egg 65
Previous Post

Blackheads : కేవ‌లం 5 నిమిషాల్లో ఇలా బ్లాక్ హెడ్స్‌ను తొల‌గించుకోవ‌చ్చు.. ఏం చేయాలంటే..?

Next Post

Fairness With Turmeric : దీన్ని రాస్తే చాలు.. మీరు చూస్తుండ‌గానే తెల్ల‌గా మారిపోతారు..!

Related Posts

వినోదం

కమల్ హాసన్ నటించిన థగ్‌ లైఫ్‌ మూవీ ఎలా వుంది?

June 9, 2025
Off Beat

క్యాండిల్స్ త‌యారీ బిజినెస్ అంటే.. డ‌బ్బులు క‌ట్టింది.. న‌మ్మి మోస‌పోయింది..

June 9, 2025
international

ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత చాలా జాగ్ర‌త్త ప‌డుతున్న పాకిస్థాన్‌..?

June 9, 2025
ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!