Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Sleep : రోజుకు మ‌న‌కు అస‌లు ఎన్ని గంట‌ల నిద్ర అవ‌సరం.. సైంటిస్టులు ఏమ‌ని చెబుతున్నారు..?

Admin by Admin
May 5, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Sleep : నిద్ర మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. నిత్యం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్రించాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కొంద‌రు అంత‌క‌న్నా చాలా త‌క్కువ స‌మ‌యం పాటు నిద్రిస్తే.. మరికొంద‌రు క‌చ్చితంగా 8 గంట‌లు ప‌డుకుంటారు. కానీ నిజానికి 8 గంట‌ల నిద్ర కూడా స‌రిపోద‌ని ఓ ప్ర‌ముఖ సైంటిస్టు చెబుతున్నారు. అవును.. మ‌నం రోజుకు క‌చ్చితంగా 8 గంట‌లు కాదు, మరో 30 నిమిషాల పాటు.. అంటే మొత్తం ఎనిమిదిన్న‌ర గంట‌ల పాటు నిద్ర‌పోవాలట‌. ఇందుకు ఆ సైంటిస్టు వివ‌ర‌ణ కూడా ఇస్తున్నారు. అదేమిటంటే..

డ్యాన్ గార్టెన్‌బ‌ర్గ్ అనే సైంటిస్టు ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ మీడియా చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయ‌న చెప్పిందేమిటంటే.. మ‌నం నిత్యం 8 గంట‌ల పాటు నిద్ర‌పోయినా స‌రే మ‌రో 30 నిమిషాల పాటు అద‌నంగా నిద్రించాల్సిందేన‌ని ఆయ‌న అంటున్నారు. ఎందుకంటే.. రాత్రి పూట మ‌నం ప‌డుకోగానే నిద్ర‌పోం క‌దా. అలాగే నిద్ర లేచే ముందు మ‌న‌కు మెళ‌కువ వ‌స్తుంది. అయినా నిద్ర‌పోయిన‌ట్టుగా క‌ళ్లు మూసుకుంటాం. దీనికి తోడు.. మ‌నం 8 గంట‌ల పాటు నిద్రించామ‌ని భావిస్తాం. కానీ 7.2 గంట‌ల పాటు మాత్ర‌మే ప‌డుకుంటామ‌ట‌. ఇదే విష‌యాన్ని ఆయన త‌న ప‌రిశోధ‌న‌లో తేల్చారు.

how many hours of sleep is required for us
Sleep

క‌నుక ఎవ‌రైనా నిత్యం 8 గంట‌ల పాటు నిద్రిస్తున్నామ‌నుకుంటే పొర‌పాటు. మ‌రో 30 నిమిషాలు అద‌నంగా నిద్రించాల్సిందేన‌ని, దీంతో క‌చ్చితంగా 8 గంట‌ల నిద్ర పూర్త‌వుతుంద‌ని డ్యాన్ గార్టెన్‌బ‌ర్గ్ చెబుతున్నారు. అయితే ఉద‌యం 30 నిమిషాల పాటు అద‌నంగా నిద్రించ‌లేమ‌ని అనుకునేవారు మ‌ధ్యాహ్నం ఆ స‌మ‌యాన్ని పూర్తి చేయ‌వ‌చ్చ‌ని గార్టెన్‌బ‌ర్గ్ అంటున్నారు. అంటే.. మ‌ధ్యాహ్నం పూట 20 నుంచి 30 నిమిషాల పాటు నిద్రిస్తే చాలు.. రోజు కోటా 8 గంట‌ల నిద్ర పూర్త‌వుతుంద‌ట‌. దీని వ‌ల్ల చురుగ్గా ప‌నిచేయ‌వ‌చ్చ‌ని కూడా గార్టెన్‌బ‌ర్గ్ చెబుతున్నారు. మ‌రింకెందుకాల‌స్యం.. చురుగ్గా ఉండాలంటే మీరు కూడా ఈ సూచ‌న ఫాలో అయిపొండి మ‌రి.

Tags: sleep
Previous Post

Raw Mango Dal : ప‌చ్చి మామిడికాయ‌ల‌తో ప‌ప్పును ఇలా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Next Post

Mango Chutney : ప‌చ్చి మామిడికాయ‌ల‌తో చ‌ట్నీ.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.