Coconut Halwa : కొబ్బరి అంటే మనలో చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏది అయినా సరే నేరుగా తింటుంటారు. కొందరు వీటిని చక్కెర లేదా బెల్లంతో కలిపి తింటారు. ఇక వీటితో వివిధ రకాల వంటలను కూడా చేస్తుంటారు. అలాగే స్వీట్లను తయారు చేస్తుంటారు. అయితే కొబ్బరితో మనం ఎంతో రుచిగా ఉండే హల్వాను కూడా చేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి టేస్ట్ చేస్తే అసలు విడిచిపెట్టరు. దీన్ని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే కొబ్బరి హల్వాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
కోవా – పావు కిలో, ఎండు కొబ్బరి తురుము – పావు కిలో, యాలకుల పొడి – ఒక టీస్పూన్, నెయ్యి – 1 టేబుల్ స్పూన్, చక్కెర – రెండున్నర కప్పులు, నీళ్లు – 2 కప్పులు, బాదం తురుము – అర టీస్పూన్, పిస్తా తురుము – అర టీస్పూన్.
కొబ్బరి హల్వాను తయారు చేసే విధానం..
ఓ మందపాటి బాణలిలో నెయ్యి వేసి కోవా, కొబ్బరి తురుము వేసి తక్కువ మంట మీద కొద్దిగా వేయించాలి. తరువాత యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు విడిగా ఓ గిన్నెలో చక్కెర వేసి తగినన్ని నీళ్లు పోసి మరీ ముదురుగా కాకుండా తీగపాకం రానివ్వాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి, కోవా మిశ్రమం వేసి ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక దించి నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసి ముక్కలుగా కోసి బాదం, పిస్తా తురుముతో అలంకరిస్తే కొబ్బరి హల్వా రెడీ అయినట్లే. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. ఇక ఇందులో కావాలనుకుంటే కలర్ కూడా కలుపుకోవచ్చు.