Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Apple Burfi : యాపిల్ పండ్ల‌తో ఈ స్వీట్‌ను చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా లాగించేస్తారు..!

Editor by Editor
May 9, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Apple Burfi : రోజుకో యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదంటారు. అలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను మ‌న‌కు యాపిల్ పండ్లు అందిస్తాయి. అయితే యాపిల్ పండ్ల‌తో ఎంతో రుచిగా ఉండే స్వీట్స్‌ను కూడా చేసుకోవ‌చ్చు. వాటిల్లో యాపిల్ బ‌ర్ఫీ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు స్వీట్ షాపుల్లోనే ల‌భిస్తుంది. కానీ కాస్త ఓపిక ఉండాలే కానీ స్వీట్ షాపుల లాంటి రుచి వ‌చ్చేలా యాపిల్ బ‌ర్ఫీని మ‌నం ఇంట్లోనే ఎంతో సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. దీనికి పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌నిలేదు. త‌యారీ సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే యాపిల్ బ‌ర్ఫీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ బ‌ర్ఫీ త‌యారీకి కావలసిన పదార్థాలు..

యాపిల్స్ – 2, జీడిపప్పు – పావు కప్పు, పంచదార – అర కప్పు, చిక్కటి పాలు – మూడు కప్పులు, కొబ్బరి పొడి – అర కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూన్.

Apple Burfi recipe in telugu make in this method
Apple Burfi

యాపిల్ బ‌ర్ఫీ తయారీ విధానం..

ముందుగా జీడిపప్పులను నానబెట్టుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా యాపిల్ పై తొక్క‌ తీసి అందులో గింజలు లేకుండా మెత్తని గుజ్జులా తయారు చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి చిన్నమంటపై పాలను బాగా కలియబెడుతూ ఉడికించాలి. ఈ విధంగా పాలు బాగా మరుగుతున్న సమయంలో ముందుగా తయారు చేసి పెట్టుకొన్న ఆపిల్ గుజ్జు, జీడిపప్పు మిశ్రమం, కొబ్బరి పొడి వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా దగ్గర పడే సమయంలో ఇందులో చక్కెర పొడి, యాలకుల పొడి వేసి కలియబెట్టుకోవాలి. ఈ విధంగా రెండు నిమిషాలు కలిపిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ లోకి నెయ్యి పోసి మిశ్రమం మొత్తం అందులోకి వేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనకు ఏవిధంగా నచ్చితే ఆ విధమైన ఆకారంలో బ‌ర్ఫీలుగా కట్ చేసుకోవ‌చ్చు. దీంతో ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ బ‌ర్ఫీ రెడీ అవుతుంది. చాలా త్వ‌ర‌గా దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: Apple Burfi
Previous Post

Paneer Nuggets : ప‌నీర్‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి.. ఎంతో బాగుంటాయి..!

Next Post

Honey With Milk : నిత్యం ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే ఏమవుతుందో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.