Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Methi Masala Curry : ఆలూ మేథీ మసాలా కర్రీ.. అన్నం, చపాతీ, పులావ్ లోకి సూపర్ గా ఉంటుంది..!

D by D
May 23, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Methi Masala Curry : మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిలో పోష‌కాలతో పాటు ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. మెంతి కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు మెంతికూర‌తో కూడా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మెంతి కూర‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అందులో భాగంగా మెంతి కూర‌తో మ‌నం ఆలూ మేతి మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ మేతి మసాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మెంతి ఆకు – పావు కిలో, బంగాళాదుంప‌లు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర -అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 3, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ట‌మాట – మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది ఒక‌టి, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మ‌సాలా – అర టీ స్పూన్, ప్రెష్ క్రీమ్ – 3 టేబుల్ స్పూన్స్,నీళ్లు – అర కప్పు.

Aloo Methi Masala Curry recipe in telugu make in this way
Aloo Methi Masala Curry

ఆలూ మేతి మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా మెంతి ఆకుల‌ను చిన్న చిన్న‌గా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత బంగాళాదుంప‌ల‌పై ఉండే చెక్కును తీసేసి మ‌రీ చిన్న‌గా కాకుండా క‌ట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట‌ను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌ల‌ను మెత్త‌గా మ‌గ్గించాలి.

బంగాళాదుంప ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత మెంతి ఆకు వేసి క‌ల‌పాలి. దీనిని మూత పెట్టి 3 నిమిషాల పాటు మ‌గ్గించిన త‌రువాత ఫ్రెష్ క్రీమ్, నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మేతి మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పూరీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Aloo Methi Masala Curry
Previous Post

Vitamin D Deficiency Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే జాగ్ర‌త్త‌.. ఆ విట‌మిన్ లోపం కావ‌చ్చు..!

Next Post

Street Style Chicken Pakoda : ఆయిల్ పీల్చకుండా కరకరలాడే చికెన్ పకోడీ.. రోడ్ల‌పై బండ్ల లాంటి రుచి వ‌స్తుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.