రోజూ మనం ఇనే ఆహారాలు మన శరీర బరువును ప్రభావితం చేస్తాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తింటే విపరీతంగా బరువు పెరుగుతారు. ఇక అధిక బరువు పెరిగేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. అయితే అధికంగా పెరిగన బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రక రకాల విధానాలను అనుసరిస్తుంటారు. ఈ క్రమంలోనే 20 రోజుల్లో అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చా ? అంటే.. అందుకు వైద్య నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. కాకపోతే కొన్ని చిట్కాలు, సూచనలు పాటించాల్సి ఉంటుంది.
1. అధిక బరువును త్వరగా తగ్గించుకోవాలంటే రోజూ జీలకర్ర నీటిని తాగాలి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని పరగడుపునే తాగాలి. ఇలా చేస్తుంటే త్వరగా బరువు తగ్గుతారు.
2. అధిక బరువును తగ్గించడంలో మిరియాలు కూడా బాగానే పనిచేస్తాయి. రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా మిరియాల పొడిని కలుపుకుని తాగాలి. దీంతో బరువు తగ్గుతారు.
3. రోజూ పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగుతున్నా బరువు తగ్గుతారు.
4. రోజూ మూడు పూటలా భోజనం చేసిన తరువాత గంటకు ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు. గ్రీన్ టీలో పాలు, చక్కెర కలపకుండా తాగాల్సి ఉంటుంది.
ఇక అధిక బరువు తగ్గేందుకు పైన తెలిపిన చిట్కాలను పాటించడంతోపాటు ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి. రోజూ మన శరీరానికి సుమారుగా 2500 వరకు క్యాలరీలు అవసరం అవుతాయి. కనుక కనీసం 500 క్యాలరీలు తగ్గేలా ఆహారం తీసుకోవాలి. అందుకు గాను ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు సాయంత్రం స్నాక్స్ రూపంలో నానబెట్టిన బాదంపప్పు తినాలి. ఇలా చేస్తే అధిక బరువు తగ్గుతారు.
అలాగే రాత్రి త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్రలేవాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్‌ను మానేయాలి. నూనె పదార్థాలను తినరాదు. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఈ మార్పులు చేసుకుంటే అధిక బరువును త్వరగానే తగ్గించుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365