Glass Bowls : మనం రోజూ అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఆహారాన్ని వండుకోవడానికి, కూరలు చేయడానికి అనేక రకాల పాత్రలు ఉపయోగిస్తూ ఉంటాము. అల్యూమినియం, ఐరన్, నాన్ స్టిక్, స్టీల్ ఇలా వివిధ రకాల లోహాలతో చేసిన పాత్రలను ఉపయోగిస్తూ ఉంటాము. వీటిలో వండడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని మనందరికి తెలిసిందే. అయితే మనలో చాలా మంది వీటికి బదులుగా గాజు పాత్రల్లలో వండుకోవడం మొదలు పెడుతున్నారు. లోహాలతో చేసిన పాత్రలల్లో వండడం మంచిది కాదని వేడి చేసిన ఏమి కానీ గాజు పాత్రల్లలో వండుతున్నారు. అయితే గాజు పాత్రలల్లో వండడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మనం వంటల్లో వాడే కొన్ని పదార్థాల్లో ఆమ్లతత్వం ఎక్కువగా ఉంటుంది. గాఉ పాత్రలో వండినప్పుడు ఆమ్లతత్వం కారణంగా రసాయనిక చర్యలు జరిగి గాజులో ఉండే పదార్థాలు వంటల్లో కలిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గాజు పాత్రలను తయారు చేసేటప్పుడు లెడ్, కోబాల్ట్, కాడ్మియం వంటి వాటిని వాడుతూ ఉంటారు. వంటలు వండినప్పుడు వాటిలో ఉండే ఆమ్లతత్వం కారణంగా ఈ పదార్థాలు కరిగి మనం చేసే వంటల్లో కలిసే అవకాశం ఉంది. ఇలా గాజు పాత్రల్లో వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. అలాగే కోబాల్ట్, లెడ్ వంటి మూలకాలు క్యాన్సర్ ప్రేరకాలు.
గాజు పాత్రలో వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తీసుకోవడం వల్ల డిఎన్ఎ లో మార్పు వచ్చి క్రమంగా క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గాజు పాత్రలో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతిని క్రమంగా సంతానలేమికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా గాజు పాత్రలో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరిగి, శరీరం బలహీనంగా తయారవుతుంది. అలాగే మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. కనుక గాజు పాత్రల్లో కూడా వండడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అన్నింటి కంటే మట్టిపాత్రల్లో వండిన ఆహారాన్ని తీసుకోవడం మంచిదని వారు చెబుతున్నారు.