Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Biscuit Cup Cakes : బిస్కెట్ల‌తో క‌ప్ కేక్‌ల‌ను ఇలా ఎంతో సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

D by D
August 17, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Biscuit Cup Cakes : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో క‌ప్ కేక్స్ కూడా ఒక‌టి. క‌ప్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్ద‌లు అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వీటిని మ‌నం వివిధ రుచుల్లో ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన క‌ప్ కేక్ వెరైటీల‌లో బిస్కెట్ క‌ప్ కేక్స్ కూడా ఒక‌టి. పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే బోర్ బ‌న్ బిస్కెట్ల‌తో చేసే ఈ క‌ప్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. ఒవెన్ లేక‌పోయినా స‌రే ఈ క‌ప్ కేక్స్ ను మ‌నం అర‌గంట‌లో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే బిస్కెట్ క‌ప్ కేక్స్ ను ఒవెన్ లేకుండా కూడా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బిస్కెట్ క‌ప్ కేక్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోర్ బ‌న్ బిస్కెట్స్ – 150 గ్రా., బేకింగ్ పౌడ‌ర్ – అర టీ స్పూన్స్, పంచ‌దార పొడి – 2 టీ స్పూన్స్, వెనీలా ఎసెన్స్ – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన జీడిప‌ప్పు – 2 టీ స్పూన్స్.

Biscuit Cup Cakes recipe in telugu how to make these
Biscuit Cup Cakes

బిస్కెట్ క‌ప్ కేక్స్ త‌యారీ విధానం..

ముందుగా వెడ‌ల్పుగా ఉండే గిన్నెలో 2 క‌ప్పుల ఉప్పు లేదా ఇసుక పోసి గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత దీనిపై స్టాండ్ ను ఉంచి మూత పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలి. త‌రువాత బిస్కెట్ల‌ను ముక్క‌లుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిని పొడిగా చేసి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో బేకింగ్ పౌడ‌ర్, పంచ‌దార పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ క‌లుపుకోవాలి. త‌రువాత వెనీలా ఎసెన్స్, జీడిప‌ప్పు ప‌లుకులు వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు చిన్న గిన్నెల‌ను తీసుకుని అందులో క‌ప్ కేక్ కు అవ‌స‌ర‌మ‌య్యే పేప‌ర్ క‌ప్స్ ను ఉంచాలి. త‌రువాత వీటిలో కేక్ మిశ్ర‌మాన్ని స‌గానికి వేసుకోవాలి.

ఈ గిన్నెల‌ను ఒక ప్లేట్ పైఉంచి ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో స్టాండ్ పై ఉంచాలి. త‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు పెద్ద మంట‌పై బేక్ చేసుకోవాలి. త‌రువాత మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేసి 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ క‌ప్ కేక్స్ ను బ‌య‌ట‌కు తీసి చ‌ల్లారిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బిస్కెట్ క‌ప్ కేక్స్ త‌యార‌వుతాయి. పిల్ల‌లు వీటిని మ‌రింత ఇష్టంగా తింటారు. ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ జ‌రిగిన‌ప్పుడు ఇలా బిస్కెట్ల‌తో సుల‌భంగా, రుచిగా క‌ప్ కేక్స్ ను త‌యారు చేసుకోవ‌చ్చు.

Tags: Biscuit Cup Cakes
Previous Post

Wheat Flour Halwa : ఒక్క‌సారి గోధుమ‌పిండితో హ‌ల్వాను ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

Next Post

Glass Bowls : ఈ పాత్ర‌ల్లో వండిన వంట‌ల‌ను తింటున్నారా.. అయితే విషం మీ శ‌రీరంలోకి చేరుతుంది జాగ్ర‌త్త‌..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.