Black Tea : మనలోచాలా మంది టీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. కొందరు ఉదయం లేవగానే టీని తాగుతారు. కొందరు ఆందోళన, ఒత్తిడి వంటిసమస్యలతో బాధపడుతున్నప్పుడు తాగుతారు. కొందరు శారీరక బడలికను తగ్గించుకోవడానికి తాగుతారు. టీ తాగడం వల్ల శరీరానికి కొత్త ఉత్సాహం లభిస్తుందని చెప్పవచ్చు. అయితే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ టీ ని తయారు చేసుకుని తాగుతూ ఉంటాము. అమితే మనం త్రాగే అన్ని రకాల టీ లు మన ఆరోగ్యానికి అంత మేలు చేయవు. కానీ వివిధ రకాల టీ వెరైటీలలో ఒకటైన బ్లాక్ టీ మాత్రం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఒక నెల రోజుల పాటు తాగితే చాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మన శరీరంలో వచ్చే మార్పును మనం గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ టీ తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ టీ ని తాగడం వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో బ్లాక్ టీ మనకు ఎంతో సహాయపడుతుంది. అదే విధంగా బ్లాక్ టీ ని తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఆలోచనా విధానం మారుతుంది. అలాగే బ్లాక్ టీని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. ఇక బ్లాక్ టీని తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి,, ఆందోళన వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
అలాగే బ్లాక్ టీని తీసుకోవడం వల్ల శరీరంలో ఫైటో న్యూట్రియన్ల శాతం పెరుగుతుంది. శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. అంతేకాకుండా బ్లాక్ టీని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఫ్లూ, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ విధంగా బ్లాక్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని కూడా తాగడం అలవాటు చేసుకోవాలని ప్రతిరోజూ ఒక కప్పు బ్లాక్ టీ ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.