Brinjal : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలు కూడా అనేక పోషకాలను, ఆరోగ్యయ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వంకాయలతో మనం రకరకాల కూరలు, పచ్చళ్లు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉన్నప్పటికి ఇవి మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వీటిని తీసుకోకూడదు. వంకాయలను తీసుకోవడం వల్ల ఆయా సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కనుక అలాంటి వారు వంకాయలను తీసుకోకపోవడమే మంచిది.
వంకాయలను ఎవరు తీసుకోకూడదు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు ఉన్న వారు వంకాయలను తీసుకోకూడదు. వంకాయలను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. తరుచూ జలుబు వంటి ఎలర్జీలతో బాధపడే వారు కూడా వంకాయలను తీసుకోకూడదు. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి వాటితో బాధపడే వారు కూడా వంకాయలను తీసుకోకపోవడమే మంచిది. ఒత్తిడితో బాధపడే వారు వంకాయలను తీసుకోవడం వల్ల సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అదే విధంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారు కూడా వంకాయలను ఆహారంలో భాగంగా తీసుకోకపోవడమే మంచిది. వంకాయలను తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం పెరగడం తగ్గుతుంది. కనుక రక్తహీనతతో బాధపడే వారు కూడా వంకాయలను దూరంగా ఉంచాలి.
మొలల సమస్యతో బాధపడే వారు కూడా వంకాయలను తీసుకోకపోవడమే మంచిది. వంకాయలను తీసుకోవడం వల్ల మొలల సమస్య మరింతగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కళ్లల్లో దురద వంటి సమస్యలతో బాధపడే వారు కూడా వంకాయలను తీసుకోకూడదు. ఇక మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు కూడా వంకాయలను తీసుకోకూడదు. వంకాయలను తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. వంకాయలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి ఈ సమస్యలు ఉన్నవారు వాటికి దూరంగా ఉండడమే మంచిదని లేదంటే ఆయా సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.