Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Carrot Masala Fry : ఆలు క్యారెట్ మ‌సాలా వేపుడు.. ఇలా చేసి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది..!

D by D
November 26, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Carrot Masala Fry : మ‌నం బంగాళాదుంప‌లతో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూర‌లు త‌యారు చేస్తూ ఉంటాము. ఈ విధంగా మ‌నం త‌యారు చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ క్యారెట్ మ‌సాలా ఫ్రై కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, క్యారెట్ క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తిన‌డానికి, అన్నం, చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ క్యారెట్ మ‌సాలా ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ క్యారెట్ మ‌సాలా ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చిమిర్చి – 2, అల్లం – అర‌ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన క్యారెట్స్ – పెద్ద‌వి రెండు, త‌రిగిన బంగాళాదుంప – పెద్ద‌ది ఒక‌టి, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్సూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్.

Aloo Carrot Masala Fry recipe in telugu make in this way
Aloo Carrot Masala Fry

ఆలూ క్యారెట్ మ‌సాలా ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా రోట్లో ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత దంచిన ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత క్యారెట్ ముక్క‌లు, బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఇందులోనే త‌గినంత ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ముక్క‌లు పూర్తిగా వేగిన త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ క్యారెట్ మ‌సాలా ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ క్యారెట్ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Aloo Carrot Masala Fry
Previous Post

Foods For Weight Loss : ఈ 5 ర‌కాల ఫుడ్స్‌ను రోజూ తీసుకోండి.. కొన్ని రోజుల్లోనే కేజీల‌కు కేజీలు బ‌రువు త‌గ్గుతారు..!

Next Post

Oats Pakoda : కార కారంగా ఓట్స్‌తో ఇలా పకోడీల‌ను చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Related Posts

హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025
వైద్య విజ్ఞానం

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.