Herbs For Immunity : చలికాలంలో మనలో చాలా మంది తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. చలికాలం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అన్ని అనారోగ్య సమస్యలను కూడా తీసుకువస్తుంది. కనుక చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి మరింత ఎక్కువగా ఉండడం చాలా అవసరం. తగినంత రోగనిరోధక శక్తి ఉంటే ఇన్పెక్షన్ లు, అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. రోగాల బారిన పడకుండా ఉంటాము. కనుక శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఖరీదైన మందులను, యాంటీ బయాటిక్ లను వాడే అవసరం లేదు.సహజ సిద్ద పదార్థాలను ఉపయోగించి కూడా మనం చాలా సులభంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
ఇప్పుడు చెప్పే పదార్థాలను ఉపయోగించడం వల్ల మనం చాలా సులభంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలల్లో అశ్వగంధ మొక్క కూడా ఒకటి. దీనిని ఉపయోగించడం వల్ల చాలా సులభంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే అనేక రకాల మినరల్స్ కలిగిన శిలాజిత్ ను వాడడం వల్ల కూడా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కూడా శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి తయారవుతుంది. అలాగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తులసి ఆకులను ఉపయోగించి కూడా మనం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బ్రహ్మి మొక్కను ఉపయోగించడం వల్ల కూడా మనం చాలా సులభంగా అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు హార్ట్ ఎటాక్, క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో వేప కూడా మనకు ఎంతో దోహదపడుతుంది. దీనిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరాన్ని ఇన్పెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో దోహదపడతాయి. అలాగే త్రిఫల చూర్ణాన్ని వాడడం వల్ల కూడా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అదే విధంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో మునగాకు కూడా మనకు ఎంతో దోహదపడుతుంది. ఈ విధంగా ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పదార్థాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చలికాలంలో మనం ఇన్పెక్షన్ ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.