Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Telangana Style Bagara Rice : తెలంగాణ స్టైల్‌లో బ‌గారా రైస్‌ను ఇలా చేయండి.. ఏ కూర‌లోకి అయినా సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
December 15, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Telangana Style Bagara Rice : మ‌న‌కు తెలంగాణా ఫంక్ష‌న్ ల‌ల్లో ఎక్కువ‌గా స‌ర్వ్ చేసే వాటిల్లో బ‌గారా అన్నం కూడా ఒక‌టి. బ‌గారా అన్నం చాలా రుచిగా ఉంటుంది. మ‌సాలా కూర‌ల‌తో తింటే ఇది మ‌రింత రుచిగా ఉంటుంది. పండ‌గ‌ల‌కు, స్పెష‌ల్ డేస్ లో కూడా దీనిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ తో దీనిని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ బ‌గారా అన్నాన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా సులభంగాదీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. నాన్ వెజ్ వంట‌కాలు వండుకున్న‌ప్పుడు మ‌రింత స్పెష‌ల్ గా ఇలా బ‌గారా అన్నాన్ని వండుకోవ‌చ్చు. తెలంగాణా స్టైల్ లో బ‌గారా అన్నాన్ని ఎలా వండుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌గారా అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – 1/3 క‌ప్పు, పొడవుగా త‌రిగిన ఉల్లిపాయ – పెద్ద‌ది ఒక‌టి, సాజీరా – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 5, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, మిరియాలు – అర టీ స్పూన్, యాల‌కులు – 5, న‌ల్ల యాల‌క్కాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – 2 టీ స్పూన్స్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్.

Telangana Style Bagara Rice recipe in telugu very easy to make and tasty
Telangana Style Bagara Rice

బ‌గారా అన్నం త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత సాజీరా, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన త‌రువాత నాన‌బెట్టుకున్న బియ్యం, ఉప్పు వేసి క‌ల‌పాలి. బియ్యాన్ని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత పుదీనా, కొత్తిమీర‌, గ‌రంమ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి పెద్ద మంట‌పై ఒక విజిల్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత మూత తీసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ‌గారా అన్నం త‌యార‌వుతుంది. ఇలా త‌యారు చేసుకున్న బ‌గారా అన్నంతో వెజ్, నాన్ వెజ్ మ‌సాలా క‌ర్రీల‌ను తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Telangana Style Bagara Rice
Previous Post

Vastu Tips : పొర‌పాటున కూడా ఈ వ‌స్తువుల‌ను ఎవ‌రికీ ఉచితంగా ఇవ్వొద్దు, తీసుకోవ‌ద్దు..!

Next Post

Chettinad Tomato Chutney : చెట్టినాడ్ ట‌మాటా చ‌ట్నీ ఇలా చేయండి.. అన్నం, టిఫిన్స్‌లోకి ఎంతో బాగుంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.