Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Guthi Vankaya Vepudu : గుత్తి వంకాయ వేపుడును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

D by D
December 27, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Guthi Vankaya Vepudu : మ‌నం గుత్తి వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. గుత్తి వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. గుత్తి వంకాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం మసాలా వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే త‌రుచూ చేసే మ‌సాలా కూర‌లే కాకుండా గుత్తి వంకాయ‌ల‌తో మ‌నం వేపుడును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గుత్తి వంకాయ‌ల‌తో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. గుత్తి వంకాయ‌ల‌తో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలే కాకుండా ఇలా వెరైటీగా వేపుడును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గుత్తి వంకాయ‌ల‌తో రుచిగా వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గుత్తి వంకాయ వేపుడు త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

గుత్తి వంకాయ‌లు – అర‌కిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Guthi Vankaya Vepudu recipe in telugu very tasty easy to cook
Guthi Vankaya Vepudu

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, మిన‌ప‌గుళ్లు -అర టీ స్పూన్, ధ‌నియాలు – అర టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 10 నుండి 12, ఎండుకొబ్బ‌రి తురుము – పావు క‌ప్పు, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, నూనె – ఒక టీ స్పూన్.

గుత్తి వంకాయ వేపుడు త‌యారీ విధానం..

ముందుగా వంకాయ‌ల‌ను నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసి ఉప్పు నీటిలో వేసి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. వీటిని దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.త‌రువాత అదే క‌ళాయిలో శ‌న‌గ‌ప‌ప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత మిన‌ప‌గుళ్లు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. వీటిని దోర‌గా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు, ఎండు కొబ్బ‌రి తురుము వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవ‌న్నీ చ‌ల్లారిన త‌రువాత ఒక జార్ లోకి వీటిని తీసుకోవాలి. ముందుగా జార్ లో వేయించిన శ‌న‌గ‌ప‌ప్పు దినుసులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఎండుమిర్చి, ఎండుకొబ్బరి వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత ప‌ల్లీలతో పాటు మిగిలిన ప‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ఈపొడిని వంకాయ‌ల‌ల్లోకి స్ట‌ఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వంకాయ‌లు వేసి మూత పెట్టి చిన్న మంట‌పై వేయించాలి. వీటిని మ‌ధ్య మ‌ధ్య‌లో అటూ ఇటూ క‌దుపుతూ వంకాయ‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. వంకాయలు మెత్త‌గా మ‌గ్గిన త‌రువాత మిగిలిన పొడిని కూడా చ‌ల్లుకోవాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన వంకాయ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Guthi Vankaya Vepudu
Previous Post

Hair Packs For Hair Growth : ఈ హెయిర్ ప్యాక్‌ల‌ను వాడండి చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Next Post

Anda Masala Curry : రెస్టారెంట్ స్టైల్‌లో అండా మ‌సాలా ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.