Asthma : మనల్ని వేధించే శ్వాస సంబంధిత సమస్యల్లో ఆస్థమా కూడా ఒకటి. ఈ వ్యాధితో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య బారిన పడితే జీవితాంతం బాధపడాల్సింది ఉంటుంది. అలాగే జన్యు పరంగా కూడా ఈ సమస్య వస్తుంది. ఆస్థమా నుండి ఉపశమనాన్ని పొందడానికి మందులను, ఇన్హెలర్ లను వాడుతూ ఉంటారు. ఈసమస్య ఒక్కసారి వస్తే పోదని జీవితాంతం మందులు వాడాల్సిందేనని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే మందులు వాడే అవసరం లేకుండా సహజ పద్దతుల ద్వారా, జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్దతులను పాటించడం వల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న ఆస్థమా కూడా తగ్గు ముఖం పడుతుందని వారు చెబుతున్నారు. సహజ పద్దతుల ద్వారా ఆస్థమాను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్థమా వ్యాధితో బాధపడే వారు ఎప్పుడూ కూడా గోరు వెచ్చని నీటిని తాగాలి. అలాగే రోజూ వేడి నీటితో స్నానం చేయాలి. వేడి నీటితో ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కఫం, శ్లేష్మం నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఉప్పు లేని ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పును తీసుకోకపోవడం వల్ల ఆస్థమా చాలా వరకు తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు లోటు లేకుండా ఉండడానికి కూరలల్లో నిమ్మరసం పిండి తీసుకోవాలి. అలాగే కూరలను వేడి వేడిగా తీసుకోవాలి. దీంతో ఉప్పు లేకుండా కూడా సులభంగా కూరలను తీసుకోవచ్చు. అలాగే ఉడికించిన ఆహారానికి బదులుగా ఉదయం పూట మొలకెత్తిన గింజలను, జామ కాయ వంటి పండ్లను తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల ఉప్పు లేకపోయినా ఆహారాన్ని తీసుకోవచ్చు. అలాగే ఇలా పచ్చి ఆహారాలను తీసుకోవడం వల్ల కఫం ఎక్కువగా తయారవ్వకుండా ఉంటుంది. అదే విధంగా సాయంత్రం పూట ఉడికించిన ఆహారాలకు బదులుగా పండ్లను తీసుకోవాలి. వీటిని కూడా సాయంత్రం ఆరు గంటల లోపు తీసుకోవాలి. ఇలా ఉప్పు లేని ఆహారాలను తీసుకోవడం వల్ల శ్లేష్మం తక్కువగా తయారవుతుంది. శ్లేష్మం తయారవ్వడానికి ముఖ్య కారణం ఉప్పేనని దీనిని తక్కువగా తీసుకోవడం వల్ల వీలైనంత వరకు ఆస్థమా తగ్గుతుందని వారు చెబుతున్నారు. అలాగే ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల శ్వాస నాళాలు,గాలి గొట్టాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. దీంతో ఆయాసం తగ్గుతుంది. ఇలా ఆహారాన్ని తీసుకుంటూనే మొదటి 4 రోజులు మందులను వాడాలి. క్రమంగా మందుల వాడకాన్ని, ఇన్హెలర్ వాడకాన్ని తగ్గిస్తూ ఉండాలి. ఈ విధంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల 20 నుండి 30 రోజుల్లోనే ఆస్థమా నుండి చక్కటి ఉపవమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా ఉప్పు లేకుండా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆస్థమా తగ్గుతుందని చలికాలంలో, వర్షాకాలంలో కూడా ఎటువంటి సమస్య లేకుండా ఉంటుందని, తలస్నానం చేసిన, పుల్లటి పండ్లను తిన్నప్పటికి కూడా ఏం కాదని వారు చెబుతున్నారు. అలాగే ఉప్పుతో పాటు పంచదార, బెల్లంతో చేసిన వాటిని, చల్లటి పదార్థాలను కూడా తీసుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా సహజ పద్దతుల ద్వారా చాలా సులభంగా ఆస్థమా నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.