Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Aloo Bonda : ఆలుతో బొండాల‌ను ఇలా చేయండి.. సాయంత్రంలో స‌మ‌యంలో తింటే సూప‌ర్‌గా ఉంటాయి..!

D by D
February 20, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloo Bonda : ఆలూ బోండా.. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈబోండాలు చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా హోట‌ల్స్ లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భిస్తాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ ఆలూ బోండాల‌ను కూడా మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవచ్చు. వీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ బోండాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బోండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వంట‌సోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

ఆలూ స్ట‌ఫింగ్ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 4, ప‌చ్చిమిర్చి – 3, అల్లం – అరఅంగుళం ముక్క‌, వెల్లుల్లి రెమ్మ‌లు -5, ధ‌నియాలు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – పావు టీస్పూన్, ధనియాల పొడి – పావు టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Bonda recipe very tasty snack to take in the evening
Aloo Bonda

పిండి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, బియ్యంపిండి – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీస్పూన్, కారం – పావు టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని.

ఆలూ బోండా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో శ‌న‌గ‌పిండి, బియ్యంపిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు త‌ప్ప మిగిలిన ప‌దార్థాలు వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ఉండ‌లు లేకుండా బ‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత జార్ లో ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ధ‌నియాలు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు,జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఇంగువ‌, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి.త‌రువాత బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. త‌రువాత మిగిలిన పదార్థాల‌న్నీ వేసి 2 నుండి 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత ఈ మిశ్ర‌మం చ‌ల్లారిన త‌రువాత ఉండ‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా క‌లిపిన పిండిలో వంట‌సోడా, 2 టీ స్పూన్ల వేడి నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మ‌ధ్యస్థంగా వేడ‌య్యాక ఆలూ ఉండ‌ల‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్ధ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బోండా త‌యార‌వుతుంది. వీటిని ట‌మాట కిచ‌ప్, గ్రీన్ చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ బోండాల‌ను ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Aloo Bonda
Previous Post

Papaya : ఈ ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను తిన‌కూడ‌దు..!

Next Post

Ragi Roti : రోజూ మీరు తినే సాధార‌ణ చ‌పాతీల‌కు బ‌దులుగా ఈ రొట్టెల‌ను తిని చూడండి.. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Related Posts

viral news

పార్లే జి బిస్కెట్ ప్యాక్‌పై ఉన్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..? అస‌లు విష‌యం చెప్పేసిన కంపెనీ..!

July 4, 2025
information

బెయిల్‌, పెరోల్ రెండింటి మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

నీతా అంబానీ టీ తాగే క‌ప్పు ఖ‌రీదు తెలుసా..? ధ‌ర తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు తెలుసా..?

July 4, 2025
మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.