Pressure Cooker : పూర్వకాలంలో మన పెద్దలు కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. తరువాత కిరోసిన్ స్టవ్‌లు వచ్చాయి. ఆ తరువాత ఎల్‌పీజీ సిలిండర్లను వాడడం మొదలు పెట్టారు. అయితే ఎల్‌పీజీ సిలిండర్ వాడినా సరే ప్రెషర్ కుక్కర్ అయితే ఇంకా త్వరగా వంట అవుతుంది, పైగా గ్యాస్ చాలా ఆదా అవుతుంది.. అని చెప్పి చాలా మంది ప్రెషర్ కుక్కర్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే వాస్తవానికి ఏ ఆహారాలను పడితే వాటిని ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించరాదు. అలా ఉడికిస్తే ఆ ఆహారాల్లో ఉండే పోషకాలు నశిస్తాయి. ఇక ఏయే ఆహారాలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది అన్నాన్ని ప్రెషర్ కుక్కర్‌లో వండుతారు. అయితే ఇలా వండేటప్పుడు అన్నంలోకి ఆక్రిలమైడ్ అనే కెమికల్ రిలీజ్ అవుతుందట. అలా వండిన అన్నాన్ని మనం తింటే మన శరీరంలోకి సదరు కెమికల్ ప్రవేశిస్తుంది. ఇది హానికరమైన లక్షణాలను కలగజేస్తుందట. వ్యాధులను కారణమవుతుందట. ఇది మన ఆరోగ్యానికి అసలు ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. కనుక అన్నాన్ని ఎప్పుడూ ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదని వారు అంటున్నారు. సాధారణ గ్యాస్ స్టవ్ మీద గిన్నెలో వండితేనే మంచిదని అంటున్నారు.
పాలకూరను ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు..
ఇక పాలకూరను కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదని అంటున్నారు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్‌లో పాలకూరను వండితే అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా పాలకూరలో ఉండే ఆగ్జలేట్స్ కరిగిపోతాయి. దీంతో అలాంటి పాలకూరను మనం తింటే మనకు కిడ్నీ స్టోన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. పైగా ప్రెషర్ కుక్కర్‌లో వండడం వల్ల పాలకూరలో ఉండే పోషకాలు కూడా నశిస్తాయట. కనుక పాలకూరను కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదని వైద్యులు చెబుతున్నారు.
చేపలు, కూరగాయలను కూడా..
అలాగే చేపలను ప్రెషర్ కుక్కర్‌లో ఎట్టి పరిస్థితిలోనూ ఉడికించరాదు. అలా చేస్తే చేపల్లో ఉండే ముఖ్యమైన పోషకాలైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు నశిస్తాయట. అలాగే కూరగాయలను కూడా ప్రెషర్ కుక్కర్‌లో వండడం వల్ల వాటిల్లో ఉండే పోషకాలు నశిస్తాయని అంటున్నారు. కనుక ఈ ఆహారాలను ఎట్టి పరిస్థితిలోనూ ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించకండి. లేదంటే అలాంటి ఆహారాన్ని తింటే ప్రయోజనాలు కలగకపోగా మీరే ఇబ్బందుల పాలు అవ్వాల్సి వస్తుంది. కనుక ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించే విషయంలో ఈ తప్పులను అసలు చేయకండి. లేదంటే వ్యాధులను కోరి తెచ్చుకున్నవారు అవుతారు.