ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం యాక్టివ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన తాజాగా తిరుమలను కూడా దర్శించుకున్నారు. అయితే ఆయన తిరుమలకు తన ఇద్దరు కుమార్తెలతో రావడం విశేషం. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరిచారు. పవన్ రెండో భార్య రేణు దేశాయ్‌కి, తనకు పుట్టిన ఆద్య అప్పుడప్పుడు బయట కనిపిస్తుంటుంది. కానీ అన్నా లెజినివాకు, పవన్‌కు పుట్టిన ఇంకో కుమార్తె మాత్రం బయట ఎక్కడా అంతగా కనిపించదు. అయితే ఆమె తాజాగా బయట కనిపించే సరికి అభిమానులు ఆమెను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
పవన్ భార్య అన్నా లెజినివా క్రిస్టియన్. కాగా ఆమెకు, పవన్‌కు పుట్టిన కుమార్తెకు పవన్ పలీనా అంజని కొణిదెల అని పేరు పెట్టారు. అయితే ఆమె క్రిస్టియన్ కావడంతో తిరుమల నియమాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో పలీనా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసింది. అయితే ఆమె మైనర్ కనుక తండ్రి పవన్ కూడా సంతకం చేశారు. అనంతరం వారు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
కాగా పవన్ చిన్న కుమార్తెకు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అంతగా బయట కనిపించదు కనుక ఇప్పుడు ఒక్కసారిగా ఆమెను బయట చూసే సరికి ఫ్యాన్స్.. ఆమె ఎంతలా ఎదిగిపోయింది అని కామెంట్లు చేస్తున్నారు. ఇక పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుందని సమాచారం.