Blood Group : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఏదో ఒక సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళల్లో కూడా గుండె సమస్యలు ఎక్కువ అయ్యాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. శరీరంలోని గుండె అలానే రక్తంకి సంబంధం ఉంది. శరీరంలో ప్రవహించే రక్తం ద్వారా ఆరోగ్యం ఎలా వుంది..?, ఎలాంటి ఇబ్బందులు కలగవచ్చు అనేది చెప్పవచ్చు. స్టడీ ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.
అయితే మన రక్తంలో వేరువేరు గ్రూపులు ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్లడ్ గ్రూప్ అయ్యి ఉంటుంది. ఏ రక్తం రకం గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది..? ఏ రకం రక్తం వాళ్లకి ఎక్కువగా గుండె సమస్యలు వస్తాయి.. అనేది చూసేద్దాం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించబడిన 2020 పరిశోధన అధ్యయన ప్రకారం, ఏ బ్లడ్ గ్రూప్, బీ బ్లడ్ గ్రూప్ వాళ్లకు త్రోమ్బోఎంబాలిక్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట.
B బ్లడ్ గ్రూప్ O బ్లడ్ గ్రూప్‌తో కంపేర్ చేసి చూస్తే గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువ వుంది. అలానే, A గ్రూప్ వాళ్లకి గుండె వైఫల్యం, అథెరోస్క్లెరోసిస్, హైపర్‌లిపిడెమియా సమస్యలు వస్తాయి. అలానే అటోపీ, స్లీప్ అప్నియా సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ గ్రూప్ బి ఉన్నవాళ్ళకి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ అని అధ్యయనం చెబుతోంది.
ఏబీ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులకి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 23% ఎక్కువగా ఉంటుందట. అలానే బి ఉన్నవాళ్లకి 11 శాతం ఎక్కువ ప్రమాదం ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని అనుసరించడం, ఒత్తిడి లేకుండా ఉండడం, ప్రతిరోజు అరగంట సేపు వ్యాయామం చేయడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అప్పుడు గుండె సమస్యలు మీ దరి చేరవు.