సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి జనాలు చాలా కన్ఫ్యూజన్‌కి గురవుతున్నారు. అందులో జరిగే ప్రచారాలలో నిజమెంత ఉందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సమాజంలో జరిగే ఎన్నో విషయాలతో పాటు కొన్ని సార్లు పుకార్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇదే అదునుగా కొందరు బోలెడన్ని పుకార్లు స్ప్రెడ్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పాత 100 రుపాయల నోట్లు రద్దు అంటూ నెట్టింట కొన్ని పోస్టులు దర్శనమివ్వడంతో జనం అవాక్కవుతున్నారు. నోట్ల రద్దు భారతదేశాన్ని కుదిపేయగా, దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది షాక్‌లో ఉండిపోయారు.ఇక కొత్తగా ముద్రించిన 2వేల నోటుపై కూడా కేంద్రం నిషేధం విధించింది.
ఇటీవల పది రూపాయణల నాణేలు చెల్లవంటూ కూడా తెగ ప్రచారం జరగగా, దానిపై ఆర్బీఐ గట్టిగా హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పుడు తిరిగి వాడడం మొదలు పెట్టారు. మరోవైపు పాత రూ.100 నోట్లు చెల్లవని సోషల్ మీడియాలో ఓ వార్త హాల్ చల్ అవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కొందరు దుకాణదారులు పాత రూ.100 నోట్లు తీసుకోకపోవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని మరిన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో వైరల్ అవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ మీ దగ్గర పాత, చిరిగిన రూ.100 నోట్లు ఉంటే ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు. దీని కోసం మీరు ఎలాంటి ఫీజు చెల్లించక్కరలేదు. బ్యాంకుకు వెళ్లి ఫారం నింపి చిరిగిన, పాత నోటును ఇస్తే వారు దాని గుర్తింపును చెక్ చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే కొత్త నోట్లు ఇస్తారు. అయితే వాటిపై నంబర్ సిరీస్ సరిగా, స్పష్టంగా ఉండాలి. ఆ నంబర్ సిరీస్ కనిపించకపోతే ఎక్కడా ఆ నోట్లను తీసుకోరు.
అదేవిధంగా కరెన్సీ నోట్లపై లెటర్స్, నంబర్స్ రాస్తే మార్కెట్ లో ఎక్కడా ఎక్కువ తీసుకోరు. నోట్లను ఎక్కువ మడతలు పెట్టినా, అతికించినా, తడిపినా షాపుల్లో తీసుకోరు. ఇలాంటివి మీ దగ్గర ఉంటే వెంటనే మీ సమీపంలోని బ్యాంకులకు వెళ్లి కొత్త నోట్లు తీసుకోండి. పాత నోట్లను రద్దు చేసే ఆలోచన లేదని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆర్బీఐ విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని తేల్చేసింది. పాత రూ.100 నోట్లు చెల్లుతాయని, అన్ని చోట్లా వాడుకోవచ్చని కూడా పేర్కొంది.. భారతదేశానికి స్వతంత్య్రం వచ్చిన తరువాత 1949లో మొదటిసారి మహాత్మా గాంధీ ఫోటోతో 100 రూపాయల నోటు ముద్రించారు. అప్పటి నుంచి ఇది వివిధ డిజైన్లు, సైజులు, రంగులతో ప్రింట్ అయ్యి సమాజంలో చలామణి అవుతోంది. నకిలీ నోట్ల వాడుకలోకి పెరిగిపోయినప్పుడు, వివిధ డవలప్ మెంట్ కారణాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్ల రూపు రేఖలు మార్చి ఎప్పటికప్పుడు కొత్త రూపంలో చలామణిలోకి తీసుకు వస్తుండడం మనం చూస్తూ ఉన్నాం.