Divorce : వివాహం చేసుకునే వారు ఎవరైనా కలకాలం కలసి మెలసి ఉండాలనే కోరుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ విడిపోవాలని, విడాకులు తీసుకోవాలని మాత్రం అనుకోరు. అయితే అందరు దంపతులు అలా ఉండలేరు కదా. అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ప్రపంచంలోని మిగతా దేశాల పరిస్థితి ఏమో గానీ భారత్‌లో విడాకులు తీసుకునే జంటలు మాత్రం ఒకప్పుడు తక్కువగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో మన దేశంలోనూ జంటల తీరు మారుతోంది. దీంతో ఇప్పుడు మన దగ్గర కూడా విడాకులు తీసుకునే వారు పెరిగిపోయారు. అయితే విడాకుల విషయానికి వస్తే ఏ జంట అయినా అవి తీసుకునేందుకు మాత్రం పలు నిర్దిష్టమైన కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భార్యాభర్తల మధ్య విశ్వసనీయత లోపిస్తే అది విడాకులకు దారి తీస్తుంది. జీవిత భాగస్వామి మనల్ని మోసం చేస్తున్నాడు/చేస్తుంది అని తెలిస్తే అప్పుడు మనకు మన పార్ట్‌నర్‌పై ఉండే విశ్వాసం పోతుంది. అది ఫలితంగా విడాకులకు దారి తీస్తుంది. దంపతులు కచ్చితంగా తమ గురించిన ఏ చిన్న విషయాన్నయినా ఇద్దరూ ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి. లేదంటే దంపతుల మధ్య మనస్ఫర్థలు వస్తాయి. కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది. దాంతో విడాకుల వరకు వెళ్తారు. నేటి తరుణంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ పనిచేస్తున్నారు. వారికి తగిన వేతనాలను అందుకుంటున్నారు. అయితే భార్య తన కన్నా ఎక్కువ సంపాదించడాన్ని మాత్రం కొందరు భర్తలు చూసి భరించలేరు. దీంతో అది వారి మధ్య గొడవలకు, ఈగోకు కారణమవుతుంది. ఫలితంగా అది విడాకుల వరకు వెళ్తుంది.
దంపతులు ఇద్దరిలో ఒకరి పట్ల ఒకరికి కమిట్‌మెంట్ ఉండాలి. అంటే ఒకరి బాధలు, కష్టాలు, సుఖాలను మరొకరు పంచుకోవాలి. అలా లేని నాడు వారు ఇద్దరూ విడిపోతారు. ప్రేమించిన వారిని కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధాలను బలవంతంగా చేసుకునే వారు సరిగ్గా కాపురం చేయలేరు. దీంతో ఈ సందర్భంలో కూడా దంపతులు విడాకులు తీసుకుంటారు. దంపతులకు శృంగారం కూడా ముఖ్యమే. ఇందులో భార్య లేదా భర్త ఒకరు సరిగ్గా పాల్గొనకపోయినా అది అవతలి లైఫ్ పార్ట్‌నర్‌కు నచ్చదు. దీంతో శృంగారం పరంగా దంపతుల కాపురం సరిగ్గా ఉండక వారు విడాకులు తీసుకుంటారు. దంపతుల్లో ఒకరిపై ఒకరికి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవి రీచ్ కాలేకపోయినా, అవి లేకపోయినా దంపతుల మధ్య సఖ్యత ఉండదు. అది వారు విడిపోవడానికి దారి తీస్తుంది. ప్రతి ఇంట్లోనూ దాదాపుగా అత్త, కోడలు ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లోనూ వారు కలసి మెలసి ఉంటే ఏమీ కాదు. ఎలాంటి సమస్యలు రావు. కానీ వారి మధ్య సఖ్యత లేకుండా చీటికీ మాటికీ ఒకరినొకరు తిట్టుకోవడం, విమర్శించుకోవడం చేస్తే అది ఆ కోడలి కాపురంపై ప్రభావం చూపుతుంది. దీంతో ఆమె భర్త నుంచి విడాకులు కోరుకుంటుంది.
భర్త కుటుంబంలో ఉండే వ్యక్తులు సాధారణంగా అతని భార్య తరఫు కుటుంబం వారి ఆధిక్యతను భరించలేరు. ఈ విషయంలో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి అవి తీవ్ర పరిణామాలకు దారి తీసేందుకు అవకాశం ఉంటుంది. దంపతుల్లో ఆడైనా, మగైనా తమ పార్ట్‌నర్‌కు దూరంగా ఉండేందుకు యత్నిస్తుంటే అది వారి మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది. దీంతో వారు విడిపోయేందుకు ప్రయత్నిస్తారు. చివరకు అలాగే జరుగుతుంది కూడా. దంపతులకు నిత్య జీవితంలో ఏ విషయంలో అయినా ఏకాభిప్రాయం కుదరదు. ఇద్దరూ తేడాగా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో అంశంలో భేదం ఉంటుంది. అయితే ఇవి సాధారణంగా ఉంటే ఏమీ కాదు, కానీ తీవ్రంగా మారితే మాత్రం అవి దంపతులు విడిపోయేందుకు కారణమవుతాయి. పార్ట్‌నర్ తనను సరిగ్గా చూసుకోలేడని/లేదని అనిపిస్తే నమ్మకం పోతుంది. దీంతో అది విడాకులకు దారి తీస్తుంది.