మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో అంజీర్ పండు ఒకటి. ఈ డ్రై ఫ్ఱూట్ లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలుంటాయి. డ్రై అంజీర పండ్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే మీరు బోలెడు లాభాలను పొందుతారు. వీటినే అత్తి పండ్లు అని కూడా అంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కేవలం ఆరోగ్యమే కాకుండా.. అందంగా కూడా పెరుగుతుంది. చర్మం కాంతి వంతంగా, జుట్టు బలంగా తయారవుతుంది. ఆయుర్వేదంలో కూడా అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే అంజీర్ పండ్లను నానబెట్టి తింటేనే పోషకాలు అన్నీ అందుతాయి. కేవలం అంజీర్ మాత్రమే కాకుండా అంజీర్ నానబెట్టిన నీటిని తాగినా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అంజీర్ వాటర్ లో ఉండే పొటాషియం మీ గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో మరియు మెరుగుపరచడంలో సహియపడుతుంది.. హృదయ సంబంధ సమస్యలను నివారించడంలో మీకు సహాయపడుతుంది. అంజీర్ నీటిని తాగడం వల్ల మీ జీర్ణక్రియ ప్రక్రియకి ఎలాంటి ఆటంకం కలగదు. మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల వెయిట్ లాస్ అయ్యేంతుకు సహాయ పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు ఉదయాన్నే అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం మంచిది.
అంజీర పండ్లు సహజ చక్కెరకు మంచి మూలం. నానబెట్టిన అత్తి పండ్లను మీరు ఉదయాన్నే పరిగడుపున తింటే మీ శరీరానికి మంచి శక్తి అందుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. మీ శరీరానికి కావాల్సిన బలాన్ని అందిస్తుంది.ఉదయాన్నే పరిగడుపున అంజీర నీళ్లను తాగితే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో మీ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వాటర్ ను తాగితే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అంజీర్ నీరు మధుమేహాన్ని సులభంగా నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది..అంజీర వాటర్ ను పరిగడుపున తాగితే మీ ఎముకలు బలంగా ఉంటాయి. ఈ వాటర్ లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఎముకలను బలంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి.
ఈ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. అంజీర వాటర్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరం ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ వాటర్ మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడుతుంది. దీంతో మీరు ఎన్నో అంటువ్యాధులు, రోగాలకు దూరంగా ఉంటారు. అంజీర్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభ్యమవుతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. రక్త పోటును కూడా తగ్గిస్తాయి.