చాలామంది రోజూ ఉడకబెట్టిన గుడ్లు ని తింటూ ఉంటారు. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే, పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండు కూడా మనం రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. అయితే, పాలు, గుడ్లు కలిపి తీసుకోకూడదని చాలామంది అంటూ ఉంటారు. పైగా, ఇలా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటుంటారు. మరి పాలు, గుడ్లు కలిపి తీసుకోకూడదా..? తీసుకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తీసుకునే ఆహారం విషయంలో ఎటువంటి తప్పులు చేసినా, అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది. చాలామంది ఉదయం పూట ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పాలు, గుడ్లు కచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. గుడ్లను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. పచ్చి గుడ్లు తీసుకుంటూ ఉండచ్చు. బాయిల్ చేసిన గుడ్లు తీసుకుంటూ ఉంటారు. లేదంటే ఆమ్లెట్ వేసుకుని తీసుకుంటూ ఉంటారు.
పాలల్లో ప్రోటీన్, క్యాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. పాలు, గుడ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కోడిగుడ్లని సోయా పాలతో పాటుగా కలిపి తీసుకుంటే, ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఉడికించిన గుడ్డు, పాలు కలిపి తీసుకుంటే పెద్దగా ఇబ్బందిగా అయితే ఏమీ ఉండదు. ఉడికించిన గుడ్లు తీసుకున్నప్పుడు, పాలు తీసుకున్నా పరవాలేదు.
ఉడికించిన గుడ్లు, పాలు తీసుకోవచ్చు. కానీ, పచ్చి గుడ్లు తో తీసుకోకూడదు. పచ్చి గుడ్లు, పాలు తీసుకుంటే అజీర్తి సమస్యలు కలుగుతాయి. ఉడికించిన గుడ్లతో మీరు పాలు తీసుకుంటే, ఎలాంటి నష్టాలు పెద్దగా ఉండవు. కానీ, పచ్చి గుడ్లు, పాలు తీసుకోవడం వలన పొందిన ప్రోటీన్ అంతా కూడా కొవ్వుగా మారిపోతుంది. ఇలా, పలు సమస్యలు పచ్చి గుడ్డు పాలు తీసుకోవడం వలన వస్తాయి. సో, చూసారు కదా ఉడికించిన గుడ్లు తో పాలు తీసుకోవచ్చు. కానీ పచ్చి గుడ్లుతో మాత్రం పాలని తీసుకోవద్దు.