Mahesh Babu : సాధారణంగా హీరోలు తమ సినిమాలు హిట్ అయితే ఓకే. లేదంటే కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా వెకేషన్స్‌కు వెళ్తుంటారు. ఇక కొందరు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ఇలా హీరోలు తమ సినిమాలు ఫ్లాప్ అయితే భిన్న రకాలుగా ప్రవర్తిస్తారు. కానీ ఏ హీరోకు అయినా.. ఫ్లాప్, హిట్ అనేవి ముందుగా తెలియవు. అది లక్ మీద ఆధార పడి ఉంటుంది. కొన్నిసార్లు ఎంత మంచి కథతో సినిమా తీసినా నడవవు. అది అంతే. అయితే మహేష్ బాబు తన సినిమాలు ఫ్లాప్ అయితే ఏం చేస్తారో చెప్పేశారు.
సినిమా ఫ్లాప్ అనేది నాకు అత్యంత బాధాకరమైన విషయం. నా సినిమా ఫ్లాప్ అయితే చాలా విచారిస్తాను. బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను. నా సినిమా ఫ్లాప్ అయిందన్న విషయాన్ని అర్థం చేసుకుంటాను. అందుకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను. 2-3 రోజుల పాటు నా గది నుంచి బయటకు రాను. ఏడుస్తూనే ఉంటాను. చివరకు విచారం నుంచి బయట పడతాను.. అని మహేష్ తెలిపారు.
బాలకృష్ణతో చేసిన అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్‌కు మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా చెప్పారు. ఇక మహేష్ తదుపరి చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించనున్నారు. ఆ మూవీ జనవరిలో ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్లు, నటీనటుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు.