సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మానవునికి… కూడు, గూడు, గుడ్డ అనేది కచ్చితంగా అవసరం. ప్రతి మనిషికి.. ఈ మూడు లేకపోతే జీవనం చాలా కష్టతరం అవుతుంది. కూడు, గుడ్డ చాలా సులభంగా అందరికీ లభిస్తుంది. కానీ సొంతింటి కల అనేది చిరకాల స్వప్నం. సొంతిల్లు కట్టుకోవడానికి… ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. చాలామంది సరిపడ డబ్బులు లేక… బ్యాంకుల చుట్టూ తిరిగి… లోన్లు తెచ్చుకుంటారు. ప్రతి నెల తమ సంపాదనలోంచి ఈఎంఐ ల ద్వారా… ఆ రుణాలను చెల్లిస్తారు. అయితే… కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగా లేక.. బ్యాంకులు విధించిన సమయానికి EMI లు కట్టక… అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.
ఒక హోమ్ లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టడం నిలిపివేస్తే, ఆ తర్వాత సాధారణంగానే మిగతా ఇన్స్టాల్మెంట్లు కట్టొచ్చు. కానీ, వరుసగా మూడు ఇన్స్టాల్మెంట్లు కట్టడం ఆపేస్తే అసలు సమస్య మొదలవుతుంది.
అప్పుడు సదరు బ్యాంకు మనల్ని రుణం ఎగవేసిన వారిగా గుర్తిస్తుంది. ఎగవేసిన రుణాలను వసూలు చేసేందుకు బ్యాంకు తరచు నోటీసులు పంపిస్తుంటుంది. అదే సమయంలో సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల తర్వాత రుణాలు ఇచ్చే అవకాశం తగ్గుతుంది. మరోవైపు రికవరీ ఏజెంట్లు కూడా తమవైన పద్ధతుల్లో వసూలు చేసేందుకు చర్యలు మొదలు పెడతారు. అయితే మన ఇంటికి ఏమైనా కూడా మనం ఈఎంఐ కడతాం అని ముందుగానే బ్యాంకు వారు ఇచ్చే అగ్రిమెంట్లలో సంతకాలు పెడతాం. కనుక బ్యాంకు వారికి రుణాన్ని వసూలు చేసే హక్కు ఉంటుంది. కనుక రుణం అంటూ తీసుకున్నాక ఇంటికి ఏమైనా సరే రుణాన్ని మాత్రం కచ్చితంగా చెల్లించాలి. కనుక ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొనే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.