అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఇది. ఆ యువతి పేరు Hannah Koyabashi. ఆమె ఉన్నట్లుండి అదృశ్యం అయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేదా తనంతట తానుగా వెళ్లిపోయిందా.. అన్న విషయం ఎవరికీ తెలియదు. ఉన్నట్లుండి సడెన్‌గా మాయమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె తండ్రి ఆమె కోసం అన్ని చోట్లా గాలించాడు. తనకు తెలిసిన వారందరికీ ఫోన్ చేసి అడిగాడు, తన కూతురు ఏమైనా వచ్చిందా.. అని.. కానీ ఎవరూ కూడా అవును అని చెప్పలేదు. తమ కుమార్తెకు ఏదైనా జరగరాని ఘోరం జరిగిందా.. అని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఆమె తండ్రి వార్తా పత్రికల్లో, టీవీ చానళ్లలోనూ చెప్పాడు, ప్లీజ్ ఎక్కడున్నా తిరిగి రా, నీ కోసం అందరమూ ఎదురు చూస్తున్నాం.. అని ఎంతగానో వేడుకున్నాడు. కానీ హన్నా గురించి ఎలాంటి వార్త రాలేదు. ఆమె ఎక్కడ ఉందో, ఎలా ఉందో ఆచూకీ తెలియలేదు. ఆమె తండ్రి అన్ని చోట్ల గాలిస్తూనే ఉన్నాడు. తెలిసిన వారిని అడుగుతూనే ఉన్నాడు. ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. సోషల్ మీడియాలోనూ వెదికాదు. కానీ ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు.
హన్నా అలా అదృశ్యం అయ్యాక తీవ్ర మనస్థాపం చెందిన Koyabashi కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కుమార్తె లేని ఈ లోకంలో తాను కూడా ఉండనని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతను చనిపోయాక పోలీసులు ఆమె ఎక్కడ ఉందో ట్రేస్ చేయగలిగారు. ఆమె మెక్సికోలో ఉన్నట్లు ఒక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అయితే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మిస్టర్ Koyabashi ఈ లోకంలో లేడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కనీసం ఆ యువతి ఎక్కడ ఉందో తండ్రికి చెబితే ఆయన బతికి ఉండేవాడు కదా అని చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఆ యువతిని తీవ్ర పదజాలంతో నెటిజన్లు దూషిస్తున్నారు.