శరీరంపై ఉండే పుట్టుమచ్చలను బట్టి ఎవరు ఎలాంటి వారో, ఎవరి వ్యక్తిత్వం, మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకునే సాముద్రిక శాస్త్రం గురించి చాలా మందికి అవగాహన ఉంది. శరీరంపై వివిధ భాగాల్లో ఉండే మచ్చలను బట్టి వ్యక్తి గుణ గణాలను, అతని స్థితిని, ఇతర వివరాలను వెల్లడిస్తారు. ఏయే భాగాల్లో పుట్టు మచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా చెబుతారు. అయితే ఇప్పుడిదే సాముద్రిక శాస్త్రంతో పుట్టుమచ్చల ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి రొమాంటిక్ లైఫ్, ప్రేమ జీవితం కూడా ఎలా ఉంటుందో సులభంగా తెలుసుకోవచ్చట. అదెలాగంటే… కింది పెదవిపై పుట్టు మచ్చ ఉంటే వారు చాలా రొమాంటిక్ అయి ఉంటారట. వీరు చాలా త్వరగా ప్రేమలో పడతారట. అంతేకాదు, అనేక సార్లు లవ్ లో పడతారట. ఎక్కువ మందిని ప్రేమిస్తారట. శృంగార సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉంటుందట.
కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే వారు ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారట. ధనవంతులు అవుతారట. ప్రేమలో సఫలం అవుతారట. కానీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారట. గడ్డంపై ఎడమ వైపు పుట్టు మచ్చ ఉంటే వీరు ఎలాంటి వారినైనా తమ వైపుకు తిప్పుకునే సామర్థ్యం కలిగి ఉంటారట. చాలా మంది ఇలాంటి వారి సాంగత్యాన్ని కోరుకుంటారట. కానీ ఎవరైనా ఒకరితోనే వీరు చాలా చనువుగా మెలుగుతారట. ఎడమ చెవిపై పుట్టు మచ్చ ఉంటే వారి వైవాహిక జీవితం బాగుంటుందట. దంపతుల మధ్య సమస్యలు రావట. వచ్చినా సర్దుకు పోతారట. చాలా అన్యోన్యమైన కాపురం చేస్తారట. అయితే రెండు చెవులపై పుట్టు మచ్చలు ఉంటే మాత్రం వైవాహిక జీవితం ఏ మాత్రం బాగుండట. అన్నీ సమస్యలే వస్తాయట.
కుడి వైపు కంటి కింద పుట్టు మచ్చ ఉంటే వీరు చాలా రొమాంటిక్ వ్యక్తులు అయి ఉంటారట. ఒకరి కన్నా ఎక్కువ మందితో వీరు లవ్‌లో పడతారట. ఎడమ చేయి భుజంపై పుట్టు మచ్చ ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయట. అదే కుడి చేతి భుజంపై పుట్టు మచ్చ ఉంటే దాంపత్య జీవితం సుఖమయం అవుతుందట. ఎడమ కన్నులో తెల్లని గుడ్డుపై పుట్టు మచ్చ ఉంటే వీరి దాంపత్య జీవితం అన్నీ సమస్యలతో కూడుకుని ఉంటుందట. అదే కుడి కన్ను తెల్లని గుడ్డుపై పుట్టు మచ్చ ఉంటే వీరి జీవితం అన్యోన్యంగా ఉంటుందట. పార్ట్‌నర్స్‌ను వీరు ఎక్కువగా ప్రేమిస్తారట. కుడి కను బొమ్మపైన నుదుటి మీద పుట్టు మచ్చ ఉంటే వీరు తమ లైఫ్ పార్ట్ నర్ విషయంలో చాలా నమ్మకంగా ఉంటారట. జీవిత భాగస్వామిని వీరు బాగా ప్రేమిస్తారట. అయితే కొన్ని సార్లు ఇబ్బందులు తలెత్తుతాయట.