Green Gram : మనకు అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆహారాల్లో పెసలు కూడా ఒకటి. వీటిని ఆయుర్వేదం అద్భుతమైన ఆహారం గానే కాక ఔషధంగా కూడా చెబుతోంది. అందుకనే వీటిని రోజూ తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పెసలను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. జ్వరం, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి పెసలు మనల్ని రక్షిస్తాయి.
పెసలను రోజూ నీటిలో నానబెట్టి అనంతరం మొలకెత్తించి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. పెసలలో విటమిన్లు ఎ, బి, సి, ఇలు అధికంగా ఉంటాయి. అలాగే పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, కాపర్, ఫోలేట్, ఫైబర్‌లు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని తినడం వల్ల క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. అందువల్ల బరువు పెరుగుతామన్న భయం చెందాల్సిన అవసరం లేదు. పైగా బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
పెసలను తినడం వల్ల ప్రోటీన్లు బాగా లభిస్తాయి. వీటితో శరీర నిర్మాణం జరుగుతుంది. కండరాల పనితీరు మెరుగు పడుతుంది. కణజాలం మరమ్మత్తులకు గురవుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది.
పెసలను రోజూ తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో పేగులు శుభ్రంగా మారుతాయి. తీవ్రమైన ఆకలి సమస్య ఉన్నవారు రోజూ పెసలను తింటే ఆకలి అదుపులోకి వస్తుంది. తద్వారా బరువు తగ్గడం తేలికవుతుంది.
పెసలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల డయాబెటిస్ సమస్య నుంచి బయట పడవచ్చు. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెసలు పెంచుతాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. శరీర మెటబాలిజంను పెంచేందుకు పెసలు సహాయ పడతాయి. దీంతో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
అసిడిటీ, అజీర్ణం, గ్యాస్, ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజూ పెసలను తినాలి. వీటిని తింటే స్త్రీ, పురుషుల్లో ఉండే సమస్యలు తగ్గుతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. అందువల్ల పెసలను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.