ఈ రోజుల్లో టీనేజ్ లో ఆకర్షణలు, ప్రేమలు సర్వసాధారణమైపోయాయి. జీవితంలో ఎవరిని ప్రేమించని, ఇష్టపడని జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటే అది మాత్రం అత్యాశే. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో తనికెళ్ల భరణిది ఓ డైలాగ్ ఉంటుంది. ఈ రోజుల్లో కేబుల్ కనెక్షన్ లేని ఇల్లు, ఎఫైర్ లేని అమ్మాయిలు దొరకడం కష్టం రా అని. పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఉండడం సహజమే అయినప్పటికీ.. పెళ్లి అయిన తర్వాత గతాన్ని విడిచిపెట్టి భర్తతో ఎంత నిజాయితీగా, ఎంత ప్రేమగా ఉంటున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఎప్పుడు చూసినా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొబైల్స్ తో బిజీగానే ఉంటున్నారు.
ఎప్పుడూ చాటింగ్ లేదా ఫోన్ కాల్స్ మీదనే ఉంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటున్నారు. అయితే ఈ జనరేషన్లో అందరూ అలా ఉన్నారని కాదు కానీ ఎక్కువ మంది యూత్ వాళ్ల సమయాన్ని లవ్ మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ఇటీవల ఇలాంటి ఘటనే హయత్ నగర్ లో చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. హయత్ నగర్ డివిజన్ సూర్య నగర్ లో నివసించే ఓ ప్రైవేటు ఉద్యోగి భార్య 25) ఓ పిచ్చి పని చేసింది.
ఆ ఉద్యోగి తన ఉద్యోగం ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతని భార్య గుర్తు తెలియని వారితో ఫోన్లో చాటింగ్ చేస్తుంది. ఇది గమనించిన అతను తన భార్యను ప్రశ్నించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన అతను తన భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన భార్య తన భర్తకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. కంగారుపడిన అతను చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ తరువాత ఏమై ఉంటుందో ఎవరైనా ఇట్టే ఊహించవచ్చు. కానీ భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి. భర్తకు భార్య మీద, భార్యకు భర్త మీద ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుని విడిపోవాలి. కానీ ఇలా తప్పుడు పనులు చేయకూడదు.