Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఈ ఉప‌యోగాలు తెలిస్తే ఉల్లిపాయ పొట్టును మీరు ఇక పారేయ‌రు..!

Admin by Admin
May 7, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఉల్లిపాయ‌ల‌ను నిత్యం మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తామ‌నే సంగ‌తి తెలిసిందే. ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి కావల్సిన కీల‌క పోష‌కాలు ఉల్లిపాయ‌ల్లో ల‌భిస్తాయి. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఉల్లిపాయ‌లే కాదు, వాటిపై ఉండే పొట్టు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే. చాలా మంది ఉల్లిపాయ‌ల‌ను పొట్టు తీసి వాడుకుంటారు. అయితే ఆ పొట్టు వ‌ల్ల కూడా మ‌న‌కు ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే పొట్టు తీసేస్తే ఆ నీటిని ఉప‌యోగించుకోవ‌చ్చు. దాన్ని రాసుకుంటే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి.

ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి. అనంత‌రం ఆ పాత్ర‌ను కిటికీలు లేదా గుమ్మం వ‌ద్ద పెడితే ఇంట్లోకి దోమ‌లు, ఈగ‌లు రావు. ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాస‌న వాటికి న‌చ్చ‌దు. అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. త‌ల‌స్నానం చేసేట‌ప్పుడు జుట్టును నీటితో క‌డిగి షాంపూ పెట్ట‌క‌ముందే ఉల్లిపాయ పొట్టుతో బాగా మ‌ర్ద‌నా చేయాలి. దీంతో వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు దృఢంగా పెరుగుతుంది. చుండ్రు, ఇత‌ర స‌మ‌స్య‌లు పోతాయి. ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. త‌ద్వారా అధిక బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, గుండె స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

you will not throw away onion peel if you know these benefits

పైన చెప్పిన విధంగా ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే దాంతో శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు న‌య‌మ‌వుతాయి. ఎందుకంటే ఆ సూప్ యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంది. అందుకే ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. ఉల్లిపాయ పొట్టుకు చెందిన సూప్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీనికి తోడు అందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. క్వ‌ర్సెటిన్ అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటుంది. అందుక‌ని ఆ సూప్ తాగితే పలు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. క్యాన్స‌ర్ క‌ణ‌తుల వృద్ధిని త‌గ్గించే గుణం ఉల్లిపాయ పొట్టు సూప్‌లో ఉంది.

Tags: Onion Peel
Previous Post

ఈ సారి టీ చేసేట‌ప్పుడు ….ఇలా చేయండి, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ చెప్పండి.!

Next Post

కొత్త ఇంట్లో పాలు పొంగించడం వలన కలిగే లాభాలు ఏమిటో మీకు తెలుసా.?

Related Posts

హెల్త్ టిప్స్

దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

May 8, 2025
చిట్కాలు

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!

May 8, 2025
mythology

క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో విషం, అమృత‌మే కాదు… ఇవి కూడా ఉద్భ‌వించాయి..!

May 8, 2025
technology

ఇన్వర్టర్ బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దానిని ఎప్పుడు మార్చాలి?

May 8, 2025
inspiration

న‌లంద విశ్వ‌విద్యాల‌యంలో విద్య‌ను అభ్య‌సించిన చైనా యాత్రికుడు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

May 8, 2025
Off Beat

ఆడ‌పిల్ల‌లు ఉన్న త‌ల్లిదండ్రులు త‌ప్ప‌క ఇది చ‌ద‌వాల్సిందే..!

May 8, 2025

POPULAR POSTS

న‌ట్స్ & సీడ్స్

Chia Seeds In Telugu : చియా విత్త‌నాల‌కు చెందిన ఆరోగ్య ర‌హ‌స్యాలు..!

by Admin
July 23, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

రోజూ 30 సార్లు ఓం అని ప‌ఠిస్తే క‌లిగే అద్భుత‌మైన లాభాలు ఇవే..!

by Admin
May 8, 2025

...

Read more
food

Tomato Red Chilli Pickle : ట‌మాటా పండు మిర్చి నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టాలి.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

by D
February 26, 2023

...

Read more
పోష‌కాహారం

Children Height Increase : మీ పిల్లలు బాగా ఎత్తుగా పెరగాలంటే.. వీటిని తినిపించండి..!

by Admin
January 2, 2022

...

Read more
కూర‌గాయ‌లు

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే..!

by D
March 22, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.