కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కచ్చితంగా పాలు పొంగిస్తారు, పాలు పొంగియటం హిందువుల సంప్రదాయంగా భావిస్తారు, అంతే కాదు, ఆలా చేయటానికి కారణాలు కూడా ఉన్నాయ్, హిందువులు ధర్మాలను, సిద్ధాంతాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరే సమయంలో కానీ ఇతర ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో పొయ్యిపై పాలు పొంగించడం సంప్రదాయం.
పాలు పొంగిన గృహాలు అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెబుతారు. దీని వెనక ఒక అర్థముంది. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె సముద్ర గర్భంనుంచి జన్మించింది. నారాయణి హృదయేశ్వరుడు పాల సాగరమున పవళించిన శ్రీహరి. అందుకే పాలు పొంగితే అష్టైశ్వరాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధి వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ఆవు తిరిగిన వారి ఇళ్లలో ఎలాంటి దోషాలు ఉండవు. కొత్త ఇంట్లోకి చేరే సమయంలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను పిలిచి ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో అన్నం వండి వాస్తుపురుషునికి సమర్పిస్తారు. ఈ పూజతో ఆ ఇంట్లో సుఖశాంతులకు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఇంత మంచి జరుగుతుంది కాబట్టే ఇంట్లో పాలు పొంగించడం నిర్వహిస్తారు.
ఇంటి ఆడపడచులకు పెద్దపీట వేస్తారు. వదిన, ఆడపడచులకు మధ్య సఖ్యతకు ఇలాంటి కార్యక్రమాలు మరింత తోడ్పడుతాయి. కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముందుగా ఆవును ప్రవేశపెట్టి తరువాత ఆ గృహ యజమాని లోపలికి ప్రవేశిస్తాడు. గోవు కామధేనువుకు ప్రతిరూపం.
దీంతో పాటు కొత్తగా గృహాన్ని నిర్మించిన అనంతరం ప్రవేశించే కార్యక్రమంలో బంధుమిత్రులను పిలుస్తాం. అందరితో ఆనందంగా గడుపుతాం. చాలా మందికి సొంతిల్లు అనేది ఒక కల, తనకంటూ ఒక ఇల్లు, అందులో తన కుటుంబం తో సంతోషంగా గడపాలి అనుకుంటారు, అందుకే ఇంటి విషయానికి వచ్చే సరికి వాస్తు మొదలు ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాన్నీ శాస్త్రాన్ని పాటించి తీరుతారు, గృహ ప్రవేశమప్పుడు పాలు పొంగిస్తే మంచి జరుగుతుంది అనే నమ్మకం మీద పాలు పొంగిస్తారు, ఆ నమ్మకానికి విలువ ఇచ్చారు అంటే ఇల్లు మీద ఎంత మక్కువ ఉందొ చెప్పొచ్చు.