అమితాబ్ బచ్చన్… పరిచయం అక్కర్లేని పేరిది. ఎందుకంటే అమితాబ్ పేరు వినని వారు ఎవరు ఉంటారు చెప్పండి. స్టార్ హీరోగా ఆయన చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన కెరీర్ ప్రారంభించినప్పుడు 12 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అయినా జంజీర్ సినిమాతో ఆయన ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత అమితాబ్ వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాక్టర్‌గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న బంగ్లా ఏదో తెలుసా..? దాని పేరు జల్సా. అది ముంబైలో ఉంది. ఇలాంటి మరో 3 బంగళాలు కలిపి మొత్తం ఆయనకు 4 బంగళాలు ఉన్నాయి.
జల్సా అని పిలిచే భవనంలోనే ప్రస్తుతం అమితాబ్ ఉంటున్నారు. అయితే దీనికన్నా ముందు ప్రతీక్షా అనే బంగళాలో ఉండేవారు. ఇది అమితాబ్‌కు వారి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి. ఈ భవనం కూడా ముంబైలోనే ఉంది. కాగా సత్తే పే సత్తా అనే సినిమాకు గాను పేమెంట్ కింద నిర్మాత రమేష్ సిప్పీ ఆ జల్సా భవనాన్ని అమితాబ్‌కు ఇచ్చారు. ఇక ఈ జల్సా భవనంలోనే అమితాబ్ తన ఫ్యాన్స్‌తో ప్రతి ఆదివారం మీట్ అవుతారట. అమితాబ్ కు ఉన్న 4 బంగళాల్లో మరొక దాని పేరు జనక్. దీన్ని అమితాబ్ ఆఫీస్‌కు, వ్యాయామానికి వాడుతారు.
పైవి కాకుండా వత్స అనే మరో బంగళా కూడా అమితాబ్‌కు ఉంది. అయితే దీన్ని సిటీబ్యాంక్‌కు అమితాబ్ లీజ్‌కు ఇచ్చారు. అయితే అమితాబ్‌కు మాత్రమే కాక ఆయన కుటుంబ సభ్యులకు కూడా దేశంలోని అనేక ప్రాంతాల్లో కోట్ల విలువ గల భవనాలు ఉన్నాయట. ముంబై, ఢిల్లీ, గుర్గావ్, మధ్యప్రదేశ్, భోపాల్‌లలో ఆ భవంతులు ఉన్నాయట. కాగా అమితాబ్‌కు చెందిన పూర్వీకుల ఇల్లు ఒకటి అలహాబాద్‌లో ఉంది. అయితే ప్రస్తుతం ఇది ఓ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంది. కేవలం ఇండ్లు మాత్రమే కాకుండా అమితాబ్‌కు కోట్ల విలువ చేసే వ్యవసాయేతర భూములు ఉన్నాయట. అవన్నీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తన యావదాస్తిని కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యాబచ్చన్‌కు అమితాబ్ సమంగా పంచారు. ఆయన అనంతరం ఆస్తి ఈ ఇద్దరికీ దక్కుతుంది.