Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. జాగ్ర‌త్త‌..

Admin by Admin
May 28, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా ఇంటి చుట్టూ లేదా ఇంటి పరిసరాలలో ఎన్నో రకాల మొక్కలు, చెట్లను పెరుగుతుంటాయి. వాటిలో కొన్ని మనం నాటినవి అయితే మిగిలినవి సహజంగా పెరిగినవిగా ఉంటాయి. అయితే ఇందులో కొన్ని రకాల మొక్కలను వాస్తు ప్రకారం కూడా నాటతారు. మరికొన్ని మొక్కలు తెలిసి తెలియక నాటుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే.. మరి కొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకురావడంతో పాటు దరిద్రం వెంటాడేలా చేస్తాయి. ఒకవేళ మీ ఇంటి చుట్టూ కీడు కలిగించే ఈ చెట్లు ఉంటే వెంటనే వాటిని తొలగించాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఇంట్లో అనేక అనర్థాలు, ఇబ్బందులు కలుగుతాయని వారు పేర్కొంటున్నారు. మరి ఇంటి ఆవరణలో ఎటువంటి మొక్కలు చెట్లు ఉండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంటి పరిసరాల్లో తుమ్మ చెట్లు ఉండకూడదు. ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే నెగెటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఇంటి సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఇంటి వాతావరణం కూడా గందరగోళంగా మారుతుంది. ఇంటి చుట్టుపక్కల కాక్టస్ మొక్కలను నాటకూడదు. ఇంట్లో ఆ మొక్కలు ఉంటే ఉద్రిక్త వాతవరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. చాలామంది అలంకరణ కోసం ఈ మొక్కలు నాటుతారు. కానీ అస్సలు ఈ మొక్కలను నాటకండి. నాటితే ఇంట్లో బాధలు, చికాకులు పెరుగుతాయి. రేగు చెట్టున్న ఇంట్లో కష్టాలు కలుగుతాయి. రేగు చెట్టులోని ముళ్ల కారణంగా ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతుంది. రేగు చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవత నివసించదని వాస్తు పండితులు చెబుతున్నారు.

do not keep these plants in your home or else you will get troubles

నిమ్మ, ఉసిరి చెట్లు లేకుండా చూడాలి. ఇలాంటి చెట్లు ఉంటే ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. అశుభాలు కలుగుతాయని చాలామంది అంటుంటారు. ముళ్ళున్న పూలు, పండ్ల చెట్లు ఇంట్లో ఉంటే ఏది కలిసి రాదన్న విషయం గుర్తుంచుకోవాలి. చాలా మంది చింత, గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు. అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది. మీరు నివసించే ఇంటికి మరీ దగ్గర్లో అవి ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది. గోరింటాకు మొక్కలు ఇంట్లో ఉండటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని, ఆ గృహస్తులు ప్రశాంతంగా జీవించ లేరని అంటున్నారు. కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి ఆవరణలో కాకుండా ఇంటికి దూరంగా పెంచటం మంచిది.

ఇంటి చుట్టూ చింతచెట్లు పెంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంట్లోనే పత్తి మొక్కలను పెంచుకుంటుంటారు. అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే మంచిది. పత్తి మొక్కలు ఇంట్లో ఉంటే పలు రకాల అనర్ధాలకు దారితీస్తుంది.

Tags: plants
Previous Post

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చేందుకు ‘అది’ కార‌ణ‌మా..?

Next Post

లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న ప‌రిశ్ర‌మ‌ను మూసేయ‌లేదు.. పైగా 22వేల మంది కార్మికుల‌ను పోషించాడు ఈయ‌న‌..

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!