Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

సాధార‌ణ మ‌నుషులు నాగ‌సాధువులుగా మారాలంటే ఏం చేయాలి..? ఎలా మారుతారు..?

Admin by Admin
June 25, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పొడవైన జట్టుతోపాటు శరీరంపై దుస్తులు సైతం ఉండవు. గడ్డ కట్టే చలిలో కూడా నాగ సాధువుల శరీరంపై నూలు పొగు సైతం ఉండదు. అయితే నాగ సాధువుగా మారలంటే.. ఇన్ని పరీక్షలు దాటాల్సి ఉంటుందా? ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళ ఇటీవ‌లే జ‌రిగిన విష‌యం విదిత‌మే. కోట్లాది మంది భక్తులు ఈ మహా కుంభమేళాకు హాజరయ్యారు. అలాగే లక్షలాది మంది నాగ సాధువులు సైతం ఈ మహాకుంభ మేళలకు తరలి వచ్చారు. వీరు పొడవాటి జుట్టుతోపాటు భారీ గడ్డం, మీసాలతో ఈ మహా కుంభమేళకు పొటెత్తారు. అయితే నాగ సాధువులు.. తమ జుట్టును కత్తిరించుకోరు ఎందుకు? దీని వెనుక ఏమైనా రహ్యసం ఉందా? అంటే.. వీరు.. జుట్టు కత్తిరించుకోరు. దీంతో వారు ప్రాపంచిక బంధాలు, కోరికలతోపాటు భౌతిక సుఖాలను సైతం వదులుకొన్నారని సూచిస్తుంది. అతని సాధనతోపాటు తపస్సులో భాగం వీటిని పెంచుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. తల, గెడ్డం వెంట్రుకలు పెరగడం.. వారి ఆధ్యాత్మిక శక్తిని సంరక్షించడంలో సహాయ పడుతుంది. ఇది ధ్యానంతోపాటు యోగాలో ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

అంతేకాదు.. జుట్టుతోపాటు గడ్డం పెరగడం అనేది ప్రకృతితో వారి మమేకమైన తీరుతోపాటు జీవితం యొక్క సరళతను కూడా సూచిస్తుంది. నాగ సాధువులు తమ జుట్టును దువ్వుకోరు, తలస్నానం చేయరు. నూనె సైతం పెట్టరు. అలా వదిలేస్తారు. దీంతో శివుడు ఎలా అయితే తన జుట్టును వదిలేస్తాడో.. అలాగే వీరు సైతం వదిలేస్తారు. ఇక శివుడిని జటాధారి అని కూడా పిలుస్తుంటారు. కాబట్టి ఇది శివుని పట్ల వారి భక్తితోపాటు సాధనకు సంకేతంగా భావిస్తారు. ఇక నాగ సాధువులు శివుడిని పూజిస్తారు, అందుకే వారు శివుడిని సంతోషంగా ఉంచడానికి ఇలా చేస్తారని కూడా పలువురు బలంగా నమ్ముతారు. కొంతమంది నాగ సాధువులు తమ జుట్టు కత్తిరించుకుంటే దేవుడు తమపై కోపగించుకుంటాడని అంటుంటారు. దీని వల్ల తమ భక్తి అసంపూర్ణంగా మిగిలి పోతుందని భావిస్తారు. దీంతో వారు ఏ తపస్సు చేసినా దాని ఫలం లభించదు. అందుకే నాగ సాధువులు ఎప్పుడూ జుట్టు మాత్రం కత్తిరించుకోరు.

how to become nagasadhu

నాగ సాధువుగా మారే ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. అంతేకాదు చాలా కష్టాలతో కూడుకున్నది. తొలుత అన్వేషకులు విభాగంలో చేరడానికి సుమారు 6 సంవత్సరాలు పడుతుంది. నాగ సాధువు కావడానికి.. సాధకులు మూడు దశలను దాటాల్సి ఉంది. అందులో తొలి దశ మహా పురుషుడు, రెండవ దశ అవధూతుడు, మూడవ దశ దిగంబరుడు. తుది తీర్మానం తీసుకునే వరకు.. ఇంకా చెప్పాలంటే.. నాగ సాధువులుగా మారే వరకు కొత్త సభ్యులు లుంగీలు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. కుంభమేళాలో ఆఖరి ప్రతిజ్ఞ చేసిన అనంతరం.. లుంగిని విడిచిపెట్టి.. తన జీవితాంతం దిగంబరుడిగా ఉండాల్సి వస్తుంది. ఒకరు నాగ సాధువు అయినప్పుడు, అతని జుట్టు మొదటి సారి కత్తిరించబడుతుంది. దీని తర్వాత అతను తన జీవితాంతం జుట్టు కత్తిరించకుండానే ఉంటాడు.

ప్రయాగలో జరిగిన కుంభమేళ నుంచి ప్రారంభించ బడిన నాగ సాధువు రాజేశ్వర్ అని పిలువబడతాడు. ఎందుకంటే అతను త్యజించిన తర్వాత రాజయోగాన్ని పొందాలని కోరుకుంటాడు. ఉజ్జయిని కుంభమేళ నుంచి దీక్ష తీసుకునే సాధువులను ఖూనీ నాగులంటారు. వారి స్వభావం చాలా దూకుడుగా ఉంటుంది. హరిద్వార్‌లో దీక్ష తీసుకునే నాగ సాధువులను బర్ఫానీలని పిలుస్తారు. వీరు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. నాసిక్ కుంభంలో దీక్ష తీసుకునే సాధువును ఖిచ్డీ నాగ అంటారు. వీరికి కూడా స్థిరమైన స్వభావం లేదని చెబుతారు.

Tags: nagasadhu
Previous Post

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తుల్లో ఎవరు సమర్థులు-శక్తిమంతులు?

Next Post

నటి సూర్యకాంతం భర్త ఎవరో తెలుసా..?

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.