మన దేశంలో ఒక్కో ప్రాంతానికి చెందిన వారి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఉత్తరాది వారు ఎక్కువగా గోధుమలతో చేసిన రొట్టెలను తింటే దక్షిణాది వారు బియ్యంతో వండిన అన్నాన్ని ఎక్కువగా తింటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఇవి కాకుండా ఇతర వేరే రకాలకు చెందిన ఆహార పదార్థాలను తింటారు. అయితే చాలా మంది ముందుగా కొన్ని గోధుమ రొట్టెలు తిని ఆ తరువాత అన్నం తింటారు. ఇలా తినే వారు చాలా మందే ఉంటారు. కానీ నిజానికి అలా గోధుమ రొట్టెలను, అన్నాన్ని కలిపి అలా ఒకేసారి తినకూడదట తెలుసా..? అవును, షాకింగ్‌గా ఉన్న ఇది నిజమే. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..!
బియ్యం వండగా వచ్చే అన్నంలో కేవలం కార్బొహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. అందులో ఫైబర్ (పీచు పదార్థం దాదాపుగా ఉండదు). అదే గోధుమ రొట్టెల్లో కార్బొహైడ్రేట్స్‌తోపాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీంతో రొట్టెలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందుకే మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు గోధుమ రొట్టెలకు ప్రాధాన్యతనిస్తారు. అది వేరే విషయం. అయితే రొట్టెలు, అన్నం మాత్రం ఒకేసారి తినరాదు. అలా తింటే ఏమవుతుందంటే… ఈ రెండింటికీ జీర్ణం అయ్యేందుకు వేర్వేరుగా సమయం పడుతుంది. అన్నం త్వరగా జీర్ణమైతే రొట్టెలు త్వరగా కావు. ఫైబర్ ఉండడం వల్ల ఆలస్యమవుతుంది. దీంతో రెండింటికీ పొత్తు కుదరదు. అప్పుడు జీర్ణాశయ సమస్యలు వస్తాయి.
ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కనుక ఎవరైనా ఈ రెండింటినీ కలిపి తినరాదు. దేన్నో ఒక దాన్నే ఆహారంగా తినాలి. అలా కలిపి తినాల్సి వస్తే కనీసం 2 గంటల వరకు గ్యాప్ ఇవ్వాలని వైద్యులు అంటున్నారు. దీంతో జీర్ణ సమస్యలు రావట. జీర్ణాశయానికి ఎలాంటి ఇబ్బంది కలగదట. అలా కాకుండా రెండింటినీ కలిపి తింటాం అంటే… అప్పుడు పైన చెప్పిన విధంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది..!