తెగే దాకా లాగితే…… అందరూ అన్ని వేళలా ఊరుకోరు. India water treaty ని నిలిపివేసిన విషయం మనకి తెలిసినదే! దానికి ముందు జరిగిన విషయాలు క్లుప్తంగా.. భారత్ మన వాటా నీళ్లు ( కేటాయించిన ఆ కాస్త) సద్వినియోగం చేసుకునేందుకు రెండు ప్రాజెక్ట్స్ నిర్మాణం చేపట్టింది. కృష్ణ గంగ, Rattle hydro project. దీనికి కూడా పాక్ అభ్యంతరం చెప్పింది. IWT ఒప్పందం ప్రకారం అభ్యంతరాలు ఉంటే క్రింది 3 ఆప్షన్స్ తో పరిష్కరించుకోవాలి. టెక్నికల్ ఇబ్బందులు పరిష్కరించడానికి Permanent Indus commission ని ఏర్పాటు చేసి రెండు దేశాల సభ్యులు కలసి సమస్యలు పరిష్కరించుకోవాలి. Neutral expert ని ఆహ్వానించి సమస్య పరిష్కారం కోరవచ్చు. Permanent court of Arbitration కి సమస్యని తీసుకు వెళ్ళవచ్చు. పాకిస్తాన్ 2006 నుంచీ IWT ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని మనల్ని ఇబ్బంది పెడుతుంది.
Permanent court of Arbitration లో భారత్ కి అనుకూలం గా తీర్పు వచ్చింది. భారత్ నిర్మాణాలు చేపట్టవచ్చు అని కాకపోతే డిజైన్ లో మార్పులు అవసరం అని సూచించింది. ఆ డిజైన్ విషయం లో కూడా పాక్ చాలా పేచీలు పెట్టింది. చాలా జరిగాయి….అవి కవర్ చేయకుండా ముఖ్యమైనవి మాత్రం చూద్దాం క్లుప్తంగా. సమస్య పరిష్కారంలో మొదటి ఆప్షన్ ఫెయిల్ అయ్యింది. మొదట్లో, రెండో ఆప్షన్ ప్రకారం న్యూట్రల్ expert ని నియమించమని world bank ని కోరింది పాకిస్తాన్. expert నియామకం జరిగిన తరువాత అది వద్దు, డైరెక్ గా మూడవ ఆప్షన్ కి వెళ్తాం అంది. భారత్ మాత్రం ఒప్పందం ప్రకారం రెండవ ఆప్షన్ ప్రకారమే వెళ్ళాలి అని పట్టుబట్టింది. ఈ విషయం మీద పాక్ Permanent court of Arbitration మెట్లు ఎక్కగా…ఈ సారి పాకిస్తాన్ కి అనుకూలం గా తీర్పు వచ్చింది. భారత్ ఏకపక్షంగా IWT ఒప్పందం నిలిపివేయడం సరికాదని.
ఆ తీర్పుని భారత్ క్రింది లీగల్ పాయింట్స్ తో తిరస్కరించింది. IWT ఒప్పందం ప్రకారం , ఒక ఆప్షన్ తరువాత రెండవ ఆప్షన్ చూడాలి తప్ప ఒకేసారి రెండు పార్లెల్ గా జరగకూడదు. న్యూట్రల్ expert option ఇంకా కొలిక్కి రాకముందే మూడ ఆప్షన్ invoke చేయడం invalid అని రెండు దేశాలు ఒప్పుకుంటేనే మూడవ ఆప్షన్ వాడాలి, భారత్ దానికి అంగీకారం తెలుపలేదు కనుక మీ తీర్పు invalid అని స్పష్టం చేసింది. అసలు Permanent court of Arbitration proceedings లో భారత్ తన representation ఇవ్వలేదు. IWT ఒప్పందం నిలిపివేయడం దేశ రక్షణ, సార్వభౌమాధికారం, ప్రజల రక్షణ వంటి వాటి క్రిందికి వస్తుంది అని, వాటి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు భారత్ కి మాత్రమే ఉన్నదని మీ మధ్యవర్తిత్వం ఇక్కడ అవసరం లేదు అని తెలిపింది. సమస్యలు పరిష్కరించుకుందాం రండి అని పూర్వం భారత్ చేసిన విజ్ఞప్తులకు సమాధానం కూడా చాలా సార్లు పాకిస్తాన్ ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం gap ఇవ్వకుండా భారత్ ని రకరకాలుగా ( విజ్ఞప్తులు, బెదిరింపులు, హెచ్చరికలు ) IWT పునరుద్ధరణ జరగాలని చెబుతుంది.