ఉత్తరంవైపు తిరిగి పడుకోకూడదని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఎందుకు ఉత్తరం వైపు తిరిగి పడుకోకూడని ఎప్పుడు ఆలోచించారా ? దీనికి చాలా కారణాలు, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ల మాటలు ఊరికే పోవు. వాళ్లు ఏ సంప్రదాయం తీసుకొచ్చినా.. అందులో చాలా ప్రాధాన్యతలుంటాయి. ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఉత్తరం దిశగా తలచేసి పడుకోవడం వల్ల ఖచ్చితంగా చెడు కలలు వస్తాయని.. అవి మన మనసుని దెబ్బతీసేలా ఉంటాయట. ఉత్తరం దిశగా పడుకోవడం వల్ల మన శరీరం పాజిటివ్ ఎనర్జీని కోల్పోతుంది. ఇది ఒక ముఖ్యమైన కారణం. పూర్వీకుల నుంచి చెబుతున్న అద్భుతమైన నమ్మకం ఇది. అంతేకాదు హిందూ పురాణాల ప్రకారం గణపతి తలకు ఏనుగు తల పెట్టడానికి కూడా ఈ నార్త్ డైరెక్షన్ తో సంబంధముంది. ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇంకా నార్త్ డైరెక్షన్ లో నిద్రించకపోవడం వెనక ఉన్న మరిన్ని కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
పార్వతీ దేవి పుణ్యస్నానానికి వెళ్లినప్పుడు గణపతిని తలుపు దగ్గర కాపాలాగా పెడుతుంది. ఎవరినీ లోపలికి రానివ్వకుండా చూసుకోవాలని వినాయకుడికి సూచిస్తుంది పార్వతిదేవి. అయితే అప్పుడు శివుడు పార్వతిని చూడటానికి వచ్చి.. తనను లోపలికి అనుమతించాలని వినాయకుడిని కోరుతాడు. కానీ వినాయకుడికి శివుడు పార్వతిదేవి భర్త అని తెలిసినా కూడా.. పార్వతిదేవిని చూడటానికి శివుడిని లోపలికి వెళ్లనివ్వకుండా.. అడ్డుకుంటాడు. పార్వతీదేవి పుణ్యస్నానం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి చూసేసరికి.. గణపతి, శివుడు గొడవ పడుతూ ఉంటారు. శివుడు తీవ్ర ఆగ్రహానికి లోనై.. అతని భటులతో వినాయకుడి తల నరికించేస్తాడు. పార్వతీదేవి చాలా ఆగ్రహానికి లోనవుతుంది. తన బిడ్డను తిరికి కాపాడాలని మొండిపట్టుదలగా ఉంటుంది. దీంతో ఆ శివుడు.. ఉత్తరం దిశగా పడుకున్న జీవి తలను నరికి తీసుకురావాలని ఆదేశిస్తారు.
శివుడి ఆదేశంతో.. ఆయన భటులు.. ఉత్తరం దిశగా నిద్రిస్తున్న జీవుల కోసం వెతుకుతారు. శివుడి అనుచరులు ఉత్తరం దిశగా పడుకున్న ఏనుగును చూస్తారు. దీంతో ఏనుగు తల నరికి తీసుకెళ్లి శివుడికి ఇస్తారు. ఇలా ఉత్తరంవైపు పడుకున్న జీవి తల తీసుకురమన్నాడు కాబట్టి.. ఇటువైపు తిరిగి పడుకోకూడదనే ఒక నమ్మకం మొదలైంది. ఇలా వినాయకుడు మళ్లీ ఏనుగు తలతో పునర్ జన్మ పొందుతారు. ఆ తర్వాత అందరి దేవుడిగా వినాయకుడు మారిపోయాడు. ప్రజలు ముందుగా పూజించే దైవంగా వినాయకుడు ఉంటాడని శివుడు పార్వతికి మాటిస్తాడు. మనం ఉత్తరం దిశగా తలపెట్టి పడుకోవడం వల్ల.. మన శరీరంలో రక్త ప్రసరణకు ఆటకం అవుతుందని, దీనివల్ల నిద్రలో ఆటంకం ఏర్పడుతుందని సైన్స్ చెబుతుంది. అలాగే మనలో ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయట. హిందూ పురాణాల ప్రకారం తూర్పు లేదా పడమర వైపు నిద్రించడం మంచిది. దీని వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరిగి, ఆరోగ్యం బావుంటుందని ఒక నమ్మకం ఉంది.