ప్రపంచంలో అన్నిటికీ చట్టాలున్నాయి, మనం పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదోక విధంగా వాడే ఇంటర్నెట్ కి కూడా చట్టాలున్నాయని మీకు తెలుసా? మ్యూజిక్ ఆల్బం పైరసీ నుండి, టొరెంట్ల నుండి మూవీస్ డౌన్ లొడ్ చేయడం దాకా మనం ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటాము. ఇది చట్ట వ్యతిరేకమని తెలిసినా మనం చేస్తూ ఉంటాము. వీటిలొ కొన్ని మనకి తెలిసినప్పటికి, చట్ట వ్యతిరేకమని తెలియనివి కూడా చాలా ఉన్నాయి. అవేంటొ తెలుసుకుందామా??? మూవీస్ మరియు టీ వీ షో లు డౌన్ లోడ్ చేయడం చట్ట వ్యతిరేకం.టొరెంట్ వెబ్ సైట్లను ఇప్పటికే చాలా దేశాలలో నిషేధించారు, అయినా ఇప్పటికీ చాలా మంది మూవీస్ మరియు టీ వీ షో లు డౌన్ లోడ్ చెస్తూనే ఉన్నారు.
డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేయడం చట్ట వ్యతిరేకమని మనలొ ఎంతమందికి తెలుసు? ఎన్నొ భయానక ఏక్సిడెంట్లకి డ్రైవింగ్ చేస్తూ టెక్స్ట్ చేయడం కారణమైంది, అయినప్పటికీ మనలొ చాలా మంది ఆన్ లైన్ కు సంబంధించిన ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉన్నాము. ఏదైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసేప్పుడు ఈ విధంగా నకిలి ఐ పి అడ్రస్ వాడుతుంటారు. అది మూవీస్ డౌన్ లోడ్ చేయడం కావచ్చు , పోర్న్ చూడడానికి కావచ్చు లెక మరేదైనా కావచ్చు , నకిలీ ఐ పి అడ్రస్ వాడడం ఏ విధంగా కూడా ఆమోదయోగ్యం కాదు.
ఏదైన వస్తువుని ఆన్ లైన్ లో అమ్మేడప్పుడు అస్సలు ఆలోచనకు రాని విషయం ఆదాయాన్ని ప్రకటించడం.. ఈబే లేకా వేరే యే వెబ్ సైట్ లో అయిన అమ్మే ముందు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి రూలు ఏంటంటే , మీ ఆదాయాన్ని ప్రకటించడం. ఇంటర్నెట్ లొ ఉన్న చాలా వెబ్ సైట్ లు యాడ్స్ లేదా ప్రకటనల ద్వారా సులభంగా ఆదాయం పొందుతుంటాయి. కాబట్టి మీరు యాడ్ బ్లాకర్స్ వాడితే అది చట్ట వ్యతిరేకం.