సాధారణంగా ప్రతి కుటుంబంలో ఎన్నో కష్టాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు తలెత్తుతూ ఉంటాయి. ఈ విధమైన సమస్యల వల్ల కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతుంటారు. అయితే మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం వల్ల ఈ విధమైన సమస్యలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే తప్పకుండా మన ఇంట్లో పచ్చ కర్పూరంతో ఈ విధంగా చేయాలని పండితులు చెబుతున్నారు.
మన ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక గాజు గ్లాసులో నీటిని నింపి అందులో పచ్చకర్పూరం, కొద్దిగా పసుపు వేసి అమ్మవారి ఫోటో ముందు పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి రెండు రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఇదే విధంగా చేయాలి. అదేవిధంగా ధనానికి అధిపతి అయిన కుబేరుడిని స్థానంలో పచ్చకర్పూరాన్ని ఒక పసుపు పచ్చని వస్త్రంలో ఉంచి చుట్టి కుబేర స్థానంలో ఉంచి పూజ చేయటం వల్ల మన ఇంట్లో ధన లాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
పచ్చ కర్పూరాన్ని పసుపు పచ్చని వస్త్రంలో మూటకట్టి ప్రధాన గుమ్మానికి కట్టడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా వ్యాపారం చేసే వారు పచ్చకర్పూరాన్ని లాకర్ లో పెట్టడం వల్ల వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.